Rains in Andhra, Telangana: రెండు రోజులు బాదుడే బాదుడు.. తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పంజా
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వర్షాలు ఇప్పటికే బీభత్సం సృష్టిస్తుండగా మొత్తంగా నలుగురు చనిపోయారు. తెలంగాణలో 5 జిల్లాలకు ఆరెంజ్, 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.