Hyderabad Traffic: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్.. నిలిచిపోయిన వాహనాలు!

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ స్తంభించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా వరుణుడు దంచికొట్టడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మియాపూర్‌, మదాపూర్‌ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్, సరోజ్నీదేవి కంటి ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్‌పై వాహనాల రాకపోకలు స్లోగా సాగుతున్నాయి.

New Update
Hyderabad Traffic: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్.. నిలిచిపోయిన వాహనాలు!

Hyderabad Traffic Alert: హైదరాబాద్‌(Hyderabad)లో సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్‌ జామ్‌(traffic jam) అవుతుంటుంది. ఇక వర్షం పడిందంటే మరింత దారుణంగా పరిస్థితి ఉంటుంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతాయి. గంటల కొద్దీ ఎక్కడ ఉండాల్సిన వాళ్లు అక్కడే ఉండిపోయి ఉంటారు. ఈ తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తుండగా.. నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ స్తంభించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇక రానున్న కొన్ని గంటల పాటు అత్యవసరమైతే తప్ప లోపలే ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రజలను కోరారు.

వర్షం కారణంగా మియాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్, సరోజ్నీదేవి కంటి ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్‌పై వాహనాల రాకపోకలు స్లోగా సాగుతున్నాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ఐపీఎస్ రసూల్ పురా, తార్నాక, సంగీత్ జంక్షన్లను సందర్శించారు. హైదరాబాద్ లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్‌ఎంసీ-డీఆర్ ఎఫ్ సాయం కోసం 040-21111111 లేదా 9000113667 చేయాలని జీహెచ్‌ఎంసీ (GHMC) సూచించింది.

Also Read: హైదరాబాదీ ఇటుక బిర్యానీ గురించి మీకు తెలుసా? తింటే వావ్ అంటారంతే..


మిగిలిన జిల్లాల్లోనూ అంతే:
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా పయనిస్తుందని ఐఎండీ (IMD) అమరావతి తెలిపింది. దీని ప్రభావంతో వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ALSO READ: అల్పపీనడం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Advertisment
తాజా కథనాలు