IPL 2024 : చెన్నై లో భారీ వర్షం.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగేనా?

చెన్నై లోని చెపాక్‌ స్టేడియంలో ఐపీఎల్ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతుంది. ఇలాంటి తరుణంలో క్రికెట్ లవర్స్ కి భారీ షాక్ తగిలింది. తాజాగా చెన్నై లో భారీ వర్షం కురిసింది. ఆదివారం ఇదే స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి వాన ముప్పు కచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

New Update
IPL 2024 : చెన్నై లో భారీ వర్షం.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగేనా?

IPL 2024 Final : ఐపీఎల్ 2024 లీగ్ ఫైనల్స్ లో కోల్ కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయర్‌-2కు ఆతిథ్యం ఇచ్చిన చెన్నై లో చెపాక్‌ స్టేడియంలోనే ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతుంది. ఫైనల్స్ ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి తరుణంలో క్రికెట్ లవర్స్ కి భారీ షాక్ తగిలింది. తాజాగా చెన్నై లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం దాకా భగ భగ మండిన భానుడు.. శనివారం ఒక్కసారిగా చల్లబడ్డాడు. సాయంత్రం వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. వెంటనే అప్ర‌మ‌త్త‌మైన చెపాక్ స్టేడియం సిబ్బంది ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌తో పిచ్ మొత్తాన్ని క‌ప్పి వేశారు. వర్షం తగ్గకపోవడంతో కోల్ కతా తమ ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకుంది.

Also Read : కోల్ కతా తో ఫైనల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ డెసిషన్?

ఫైనల్ మ్యాచ్ కి వాన గండం

ఇక ఆదివారం ఇదే స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి వాన ముప్పు కచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మే 26 ఆదివారం రోజున హైదరాబాద్, కోల్ కతా మధ్య చెపాక్ స్టేడియం లో జరగనుంది. సరిగ్గా అదే రోజు వాన ప‌డేందుకు 3 శాతం చాన్స్ ఉంద‌ట‌. అంతేకాదు ఆ రోజంతా 97 శాతం వ‌ర‌కు మేఘాలు క‌మ్మి ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

రిజర్వ్ డే ఉంటుందా?

ఒకవేళ ఆదివారం వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే రిజర్వ్ డే మెథడ్ లో ఆడిస్తారు. అంటే ఆదివారం రోజు కొన్ని ఓవర్లు ఆడిన తర్వాత వర్షం పడితే మరుసటి రోజు మ్యాచ్ ఆడిస్తారు. మరి రిజర్వ్ డే లేకుండానే ఫైనల్ మ్యాచ్ ఉంటుందా? లేదా? అనేది చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు