Traffic Jam Due To Heavy Rain Fall in Hyderabad: భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్‌పల్లి, జెఎన్టీయూ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది. ఎర్రగడ్డలో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. వర్షం కారణంగా వాహనాలు రోడ్లపై భారీగా నిలిచిపోయాయి.
Also Read: హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!
పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావాడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
సికింద్రాబాద్‌లో 8.4 సెంటీమీటర్లు.. KPHBలో 7, గాజులరామారంలో 4 సె.మీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షం కారణంగా మెట్రో సేవలకు సైతం అంతరాయం కలుగుతోంది.
అయితే తాజాగా, నిఖిల్ అనే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఓ వీడియో షేర్ చేశారు. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిన వీడియోను పోస్ట్ చేస్తూ.. 'దయచేసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనండి.. ఇది కేవలం వేసవి వర్షం. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.. ట్రాఫిక్ నిలిచిపోయింది. ద్విచక్రవాహనాలపై వెళ్లే వారి పరిస్థితి అద్వనంగా ఉంది. అంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు' అని ట్విట్ చేశారు.