Tamil Nadu: తమిళనాడును ముంచెత్తుతున్న వర్షాలు.. స్కూళ్లకు సెలవులు.. గత రెండ్రోజులుగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలు చేసేందుకు ప్రజలకు అవస్థలు పడుతున్నారు. ఇక రెండు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. By B Aravind 10 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కురవడం వల్ల రోడ్లన్ని జలయమం అవుతున్నాయి. అలాగే కొన్నిచోట్ల కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోయంబత్తూరు, తిరువూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండపోత వాన పడింది. రాష్ట్రంలోని మరో 12 జిల్లాల్లో శుక్రవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనావేసింది. తంజావూర్, తిరువారూర్, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. Also read: నా భార్యను కలవాలని ఉంది..కోర్టులో పిటిషన్ వేసిన సిసోడియా! ఇదిలా ఉండగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. తిరువారూర్ జిల్లా, పుదుచ్చేరిలోని కారైక్కల్‌లో పాఠశాలలను ఈరోజు నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వర్షం వల్ల పలు రైళ్లను కూడా రద్దు చేశారు. నీలగిరి మౌంటైన్ రైల్వేలోని కల్లార్, కూనూర్ సెక్షన్ల మధ్య ట్రాక్‌పై కొండచరియలు , చెట్లు కూలిపడటంతో నవంబర్ 16 వరకు ఆ మార్గాల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో గురువారం రాత్రి వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. Also Read: చికున్‌గున్యాకు వ్యాక్సిన్ వచ్చేసింది.. ఆమోదం తెలిపిన FDA.. #telugu-news #heavy-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి