AP Rains: ఏపీలో మరో రెండురోజులు కుండపోతే!

ఏపీలో గత ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు పడుతునే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాధ్ వివరించారు. రాష్ట్రంలో వర్షాలకు కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండమేనని వెల్లడించారు.

Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు!
New Update

AP Rains: ఏపీలో గత ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు పడుతునే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాధ్ వివరించారు. రాష్ట్రంలో వర్షాలకు కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండమేనని వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో భారీ నుంచీ అతిభారీ వర్షాలు కురుస్తాయని కూర్మనాధ్ పేర్కొన్నారు.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగుల్లో నుంచీ ఎవరూ వెళ్ళద్దని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబు వరద పరిస్ధితులపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. మొత్తం జిల్లా యంత్రాంగాలకి సెలవులు రద్దు చేసి క్షేత్రస్ధాయిలో పని చేస్తున్నారని.. ఎనిమిది జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక సమీక్షను సీఎం నిర్వహించినట్లు తెలిపారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గోదావరి నదికి వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న డ్యాంలను ఎప్పటికప్పుడు స్థిరీకరిస్తున్నాం.. ప్రకాశం బ్యారేజికీ ఎగువన ఎలాంటి ఇబ్బంది లేదు.. వరద ప్రభావం తక్కువే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు వెళ్ళే జాలర్లు వేటను విరమించుకోవాలి. తుఫాను తీరం దాటే వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.” అని ఆయన తెలిపారు.

Also read: మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజినోవా… హాజరైన పవన్ కల్యాణ్

#rains #ap #heavy-rains #low-pressure
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe