IMD : ఈ నెల 8 వరకు భారీ వర్షాలు: ఐఎండీ ఎండీ!

తెలుగు రాష్ట్రాల్లో మరోసారిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

New Update
IMD : ఈ నెల 8 వరకు భారీ వర్షాలు: ఐఎండీ ఎండీ!

Rain Alert By IMD: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గురువారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

దీంతో వానగండం ఇంకా పూర్తిగా పోలేదని తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షం భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. కాగా, బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం పెద్దగా కురవలేదు. కానీ, రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లో వర్షం పెద్దగా మొదలై ఒక్కసారిగా వాతావరణం ఊహించని విధంగా మారిపోయింది.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రోడ్లపై నీరు నిలిచిన చోట మ్యాన్ హోల్స్ తెరిచే ప్రయత్నం చేయోద్దని ప్రజలకు సూచించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తప్ప ఇంకెవ్వరూ మ్యాన్‌హోల్స్‌ తెరవకూడదని, ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరించింది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాకకూడదని, ముఖ్యంగా చిన్న పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని చెప్పారు.

పొంగిపొర్లుతున్న రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లకూడదని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా వాహనాలు జారీ కిందపడే ప్రమాదం ఉందని, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని హెచ్చరింది.

Also Read: నిన్న జగన్.. ఇవాళ లచ్చన్న… మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ!

Advertisment
తాజా కథనాలు