ఐపీఎల్ 2024 (IPL 2024) లో ఢిల్లీ క్యాపిటల్ రెండో విజయం సాధించింది. శుక్రవారం లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపజర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 స్కోర్ చేసింది. ఈ టార్గెట్‌ను ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేజింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో విన్నింగ్ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ వ్యవహార శైలిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్ట్రిస్ట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పంత్‌కు పెనాల్టీ విధించాలని బీసీసీఐని డిమాండ్ చేశాడు.
లక్నో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాలుగో ఓవర్‌లో, పంత్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌తో చాలాసేపు ఏదో విషయంపై చర్చించాడు. ఇషాంత్ శర్మ దేవదత్ పడిక్కల్‌కి వేసిన డెలివరీకి పంత్ వైడ్-బాల్ రివ్యూ తీసుకున్నాడు. ఈ రివ్యూ ఢిల్లీకి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో పంత్ కోపంగా కనిపించాడు. అసలు తాను రివ్యూ కాల్ ఇవ్వలేదని ఢిల్లీ కెప్టెన్ అంపైర్లతో వాగ్వాదానికి దిగినట్లు కనిపించింది. అయితే ఇషాంత్ బాల్ వేయగానే, రిషబ్ ‘T’ సైన్‌తో రివ్యూ కోరినట్లు రీప్లేలో కనిపించింది.
“అంపైర్లు ఏ ఫార్మాట్‌లో అయినా గేమ్‌పై మరింత కంట్రోలింగ్ తీసుకోవాలి. ఆటను ముందుకు తీసుకెళ్లడానికి వారు ఇంకా బెటర్‌గా పని చేయాలి. రిషబ్ రివ్యూ కోరాడా లేదా అనే వివాదం నెలకొంది. సరే, రివ్యూ కాల్‌పై మిస్‌కమ్యూనికేషన్ ఉందనుకుందాం. కానీ పంత్, అంపైర్ అక్కడే నిలబడి 3-4 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఇది చాలా చిన్న విషయం. అంత పెద్ద కన్వర్జేషన్ అవసరం లేదు. రిషబ్ ఎంత బలంగా కంప్లైంట్ చేసినా లేదా మరే ఇతర ఆటగాడు ఫిర్యాదు చేసినా, అంపైర్లు ‘అయిపోయింది’ అని చెప్పాలి, త్వరగా ముందుకు సాగాలి. కానీ ప్లేయర్ అలాగే మాట్లాడటం కొనసాగిస్తే మాత్రం, వారికి జరిమానా విధించాలి” అని గిల్‌క్రిస్ట్ చెప్పాడు.అయితే ఇషాంత్ వేసిన ఆ బాల్, పడిక్కల్ బ్యాట్‌ను దాటి వెళ్లినప్పుడు అవుటర్ ఎడ్జ్ తీసుకుందో లేదో చెక్ చేయడానికి స్నికోమీటర్ ఉపయోగించలేదని, దీనిపై పంత్‌కు కోపం వచ్చిందని కామెంటేటర్స్ పోమ్మీ ఎంబంగ్వా, దీప్ దాస్‌గుప్తా ఆ తర్వాత స్పష్టం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పంత్ రెచ్చిపోయాడు. కేవలం 24 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 41 పరుగులు చేసి, ఢిల్లీ గెలుపుకు బాటలు వేశాడు. దీంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 168 పరుగులను ఛేదించింది.