Srisailam: శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ పరవళ్లు.. గేట్లు ఎత్తిన అధికారులు!

శ్రీశైలం నిండుకుండలా మారింది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంలో 876 అడుగుల నీటిమట్టం ఉండగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు మాత్రమే. దీంతో 3 గేట్లు ఎత్తారు అధికారులు.

New Update
Srisailam: శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ పరవళ్లు.. గేట్లు ఎత్తిన అధికారులు!

Srisailam: శ్రీశైలం నిండుకుండలా మారింది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంలో 876 అడుగుల నీటిమట్టం ఉండగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు మాత్రమే. దీంతో 3 గేట్లు ఎత్తారు అధికారులు. ఈ మేరకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల ఎగువన భారీ వర్షాలు పడంతో భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4,67,210 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 879.90 అడుగులకు చేరుకుందన్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 171.8625 టీఎంసీలుగా ఉందని తెలిపారు. అయితే ఎగువ నుంచి వస్తున్న భారీ వరద డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం కంటే ఎక్కువ ఉండటంతో సోమవారం సాయంత్రం 4 గంటలకు మూడు గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ambedkar Statue: కళ తప్పుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. నో ఎంట్రీ ఎన్నాళ్లు?

ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ భాషా తెలిపారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 80 వేల క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు