Heart Attack: యువత గుండె పోటుకు కారణం ఇదే.. వెలుగులోకి సంచలన విషయాలు!

యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇందుకు జీవనశైలి కారణమని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యం సేవించడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, ఊబకాయం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

New Update
Heart Attack: యువత గుండె పోటుకు కారణం ఇదే.. వెలుగులోకి సంచలన విషయాలు!

Heart Attack: ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనశైలిలో మార్పు వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు వృద్ధులకు మాత్రమే వస్తాయని అంటారు.. కానీ పూర్తిగా తప్పు. దీనికి వయస్సుతో సంబంధం లేదు. జీవనశైలి, జన్యుపరమైన కారణాల వల్ల గుండెపోటు రావచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యామిలీ జీన్స్, ఒత్తిడి, జీవనశైలి కారణంగా ఈ వ్యాధి ప్రమాదం పెరుగుతోంది. గుండెపోటుకు సంబంధించిన అపోహలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

గుండెపోటు ప్రమాదం నుంచి రక్షణ:

  • యువతకు గుండెపోటు వచ్చే ప్రమాదం లేదని చాలా మంది నమ్ముతారు. ఇది తప్పు. ఎందుకంటే ధూమపానం, ఒత్తిడి, ఊబకాయం వంటి అనేక ఇతర కారణాల వల్ల యువతలో ప్రమాదం పెరుగుతోంది.
  • ఒక పరిశోధన ప్రకారం.. ధూమపానం మానేయడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మద్యం సేవించడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. కాబట్టి యువత ఈ రెండింటికీ దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భార్యను బండికి కట్టి లాక్కెళ్లిన కసాయి భర్త.. వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు