Chandrababu: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌(SLP) పై రేపు(బుధవారం) ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

Supreme Court: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు
New Update

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌(SLP) పై రేపు(బుధవారం) ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. స్కిల్ డెవల్‌ప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గత శనివారం స్పెషల్ లీవ్ పిటీషన్‌ను లాయర్ గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

publive-image

సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగం జరిగిందని.. దీనిపై నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా సోమవారం సీజేఐ చంద్రచూడ్ వద్ద ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై ఈరోజు(మంగళవారం) విచారణ జరగాల్సి ఉండగా.. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ భేటీ అయిన నేపథ్యంలో మిగతా కేసులను రిజిస్ట్రీ లిస్ట్ చేయలేదు. దీంతో రేపు విచారణకు రానుంది.

మరోవైపు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్లు దాఖలు చేశారు. అనంతరం విచార ను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు సెలవుపై ఉండటంతో విచారణ చేపట్టిన ఇన్‌చార్జి న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

#ap-skill-development-case #supreme-court #chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి