Healthy New Year 2024 : కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే!

ఆరోగ్యకరమైన జీవనం కోసం నూతన సంవత్సరంలో బయట ఫుడ్ మానేయడం.. ఏడెనిమిది గంటలు నిద్రపోవడం.. శారీరక శ్రమ చేయడం.. నీరు ఎక్కువ తాగటం.. స్ట్రెస్ మేనేజ్మెంట్.. వాకింగ్ వంటి అలవాట్లు చేసుకోండి. పొగ తాగడం, మద్యం సేవించడం మానేయండి. 

Healthy New Year 2024 : కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే!
New Update

New Year 2024 : కొద్ది గంటల్లో మీరు కొత్త సంవత్సరం(New Year 2024) లోకి అడుగుపెట్టబోతున్నారు. మీరు నూతన సంవత్సరానికి అనేక ప్రణాళికలు వేసుకుని ఉండవచ్చు, కానీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమైనా ప్రణాళికలు వేసుకున్నారా? లేకపోతే, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్(Health Tips) ఇక్కడ మీకు అందిస్తున్నాం.  మీరు ఈ 7 అలవాట్లను చేసుకోండి.. వీటి సహాయంతో పూర్తి ఫిట్ నెస్ తో కొత్త సంవత్సరంలోనే కాదు. రాబోయే సంవత్సరాల్లో కూడా పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. 

  1. ఇంటి ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి

Healthy New Year 2024 : ఇంట్లో తయారుచేసిన ఆహారం మిమ్మల్ని ఫిట్‌గా - ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  బయటి నుంచి వచ్చే జంక్ ఫుడ్ మీ ఊబకాయాన్ని పెంచే అవాంఛిత కొవ్వును మాత్రమే పెంచుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే బయటి ఆహారాన్ని తగ్గించండి.. కావాలంటే 15 రోజులకు ఒకసారి బయటి ఆహారం తీసుకోవచ్చు.. అయితే ఈ అలవాటును కూడా తగ్గించే ప్రయత్నం క్రమేపీ చేయండి. 

  1. 7-8 గంటలు నిద్రపోండి

మనల్ని ఆరోగ్యంగా- తాజాగా ఉంచడానికి, మనకు ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర అవసరం, దీని కోసం మీరు సమయానికి నిద్రపోవాలి. సమయానికి మేల్కోవాలి. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటలకు పడుకునేలా ప్లాన్ చేసుకోండి. కొంతమందికి షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి. అటువంటి వారిలో మీరు ఒకరైతే.. మీ నిద్రకోసం ప్లాన్ చేసుకోండి. 7 గంటలకంటే తక్కువ నిదురించకండి.. అలాగే 8 గంటలు దాటి నిర్దపోకండి. 

  1. శారీరక శ్రమను పెంచండి

ఆరోగ్యంగా ఉండటానికి, మీరు శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం.  కాబట్టి సమీపంలోని పని కోసం కాలినడకన వెళ్లడానికి ప్రయత్నించండి.  లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించండి. ఇంటి పనుల్లో సహాయం చేయండి.

  1. నీరు ఎక్కువగా త్రాగాలి

నీరు మనకు చాలా ముఖ్యమైనది.  కానీ సాధారణంగా అందరూ తగినంత నీరు తాగరు.  అందుచేత పుష్కలంగా నీరు తాగటం అలవాటు చేసుకోండి.  ఇది మన శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.  శరీరాన్ని డిటాక్స్ చేయడం సులభం చేస్తుంది పొట్టను కూడా శుభ్రంగా ఉంచుతుంది.

Also Read: Tax Savings Schemes: కొత్త సంవత్సరంలో టాక్స్ సేవింగ్స్ కోసం ఇలా చేయండి 

  1. అరగంట పాటు నడవండి

మీ రోజువారీ దినచర్యలో అరగంట వ్యాయామం, యోగా, నడక, ధ్యానం లేదా శారీరక శ్రమను చేర్చండి. ఇది మీ అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.  మీ బరువును కూడా నిర్వహించడంలో సహాయపడుతుంది.

  1. స్ట్రెస్ మేనేజ్ చేయండి.. 

ఈరోజు పెరుగుతున్న ఒత్తిడి అంటే స్ట్రెస్ మన సమస్యలలో సగానికి మూలం.  కాబట్టి ఒత్తిడిని నిర్వహించడానికి ప్రయత్నించండి.  ఏ సమస్య మీ పై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోండి. మీరు ఎంత ఒత్తిడి లేకుండా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు.

  1. ధూమపానం - మద్యపానానికి దూరంగా.. 

Healthy New Year 2024: మన ఆధునిక జీవనశైలి వల్ల ఇప్పుడు చిన్నప్పటి నుంచే పొగతాగడం, మద్యం సేవించడం వల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కాలేయం వంటి సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి వీలైనంత త్వరగా ఈ రెండు అలవాట్లను వదిలేయండి.

Watch this interesting Video :

#health-tips #happy-new-year-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe