Healthy Food: నూనె లేకుండా బెండకాయ వేపుడు.. ఎలా చేయాలంటే నూనె లేకుండా చేసిన కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. నూనె లేకూండ మజ్జిగలో ఉడకబెట్టి వేపుళ్లు చేసి తినొచ్చు. నూనె లేకుండా టేస్ట్ గా బెండకాయ వేపుడు ఎలా చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Vijaya Nimma 23 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Healthy Food: నూనె కూరలకు ఎంతో రుచిని ఇస్తుంది. నూనె లేకుండా చేసిన కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ మధ్యకాలంలో ఎన్నో కల్తీ నూను వస్తున్నాయి. వాటి వల్ల కూడా ఆనారోగ్య సమస్యలు వస్తాయి. నూనె పోసి ప్రతి ఒక్కరూ వండుకుని తింటారు. కానీ నూనె లేకుండా కూడా బెండకాయ వేపుడు చేసుకుని తినవచ్చు. అయితే కొద్దరూ కూరగాయ ముక్కలను కుక్కర్లో ఉడికించి నీటిని పడేస్తారు. ఇలా చేస్తే పోషకాలు పోతాయి. నూనె లేకుండా, కుక్కర్లో ఉడకబెట్టకుండా, కూరగాయలను చిన్న చిన్న ముక్కలు కోసి వాటిలో ఉండే నీటితోనే వండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనె లేకూండ మజ్జిగలో ఉడకబెట్టి వేపుళ్ల కూరలు చేసి తినవచ్చు. దానివల్ల పోషకాలు బయటకు వెళ్లకుండ శరీరంలోకి పోతాయి. నూనె వాడం కావునా బరువు సులువుగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బెండకాయ వేపుడుకు కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు: ఒక కప్పు, కొబ్బరి తురుము- రెండు టేబుల్ స్పూన్లు, పల్లీల పొడి- ఒక టేబుల్ స్పూన్, నువ్వుల పొడి- ఒక టేబుల్ స్పూన్, పచ్చి శెనగపప్పు పొడి- ఒక టేబుల్ స్పూన్, మినపప్పు పొడి- ఒక టేబుల్ స్పూన్, పచ్చిశెనగపప్పు, మినపప్పు- ఒక టీ స్పూన్, కరివేపాకు, కారం- ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు- పావు కప్పు సిద్దంగా పెట్టుకోవాలి. తయారీ విధానం: బెండకాయలు శుభ్రం చేసుకుని తడిలేకుండా ముక్కలుగా కోసి ఆరబెట్టాలి. తర్వాత స్టవ్ మీద నాన్‌స్టిక్ పాన్ పెట్టి పచ్చిశెనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి దొరగా వేగించాలి. అవి వేగాక బెండకాయ ముక్కలు వేసి ఆవిరితో మెత్తబడేలా ఉడికించాలి. అవి వేగాక కొబ్బరి తురుము, పల్లీల, నువ్వుల, పచ్చిశెనగపప్పు, మినపప్పు పొడులను వేసి బాగా కలిపాలి. తర్వాత మరో 5-7 నిమిషాల పాటు వేగించాలి. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే నూనె లేకుండ రుచికరమైన 'బెండకాయ వేపుడు' సిద్దం అవుతుంది. పెద్దలు, నూనె పదార్థాలు ఎక్కువ తినలేని వాళ్లు ఇలా చేసుకుని తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ కూరని వారానికి 4 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: ఈ చిట్కాతో నిద్ర ఇట్టే పడుతుంది.. మీరు కూడా ట్రై చేయండి! #healthy-food #ladies-finger-fry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి