Brown bread Recipe: ఆరోగ్యకరమైన అల్పాహారం.. బ్రౌన్‌బ్రెడ్ తయారీ విధానం

బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి బ్రౌన్‌బ్రెడ్ అనేది మంచి ఎంపిక. మార్కెట్‌లో లభించే బ్రెడ్‌ మన ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అందుకే ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇంట్లోనే హెల్తీ బ్రెడ్‌ను తయారు చేసుకోవాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి.

New Update
Brown bread Recipe: ఆరోగ్యకరమైన అల్పాహారం.. బ్రౌన్‌బ్రెడ్ తయారీ  విధానం

Brown Bread Recipe: బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి బ్రౌన్‌బ్రెడ్ అనేది మంచి ఎంపిక. కానీ కొన్నిసార్లు మార్కెట్‌లో లభించే బ్రెడ్‌ మన ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అందుకే ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్‌బ్రెడ్ ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. శెనగపిండి, శాండ్‌విచ్‌, మరేదైనా వంటకంలోనైనా బ్రౌన్‌ బెడ్‌ తీసుకోవాలని అంటున్నారు. కాకపోతే మార్కెట్‌లో లభించే బ్రౌన్‌బ్రెడ్‌ను గుడ్డిగా నమ్మడం సరికాదని, అది ఆరోగ్యానికి మంచిదికాని చెబుతున్నారు. మనం ఇంట్లోనే హెల్తీ బ్రెడ్‌ను తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

బ్రౌన్‌ బెడ్‌కు కావాల్సిన పదార్థాలు

  • రెండు కప్పుల గోధుమ పిండి, కప్పు మైదా, ఒకటిన్నర కప్పుల గోరువెచ్చని నీరు, 2 టేబుల్ స్పూన్ల తేనె లేదా బెల్లం, రెండున్నర టీస్పూన్ల ఈస్ట్, ఒకటిన్నర టీస్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కూరగాయల నూనె లేదా కరిగించిన వెన్నె ఈ వన్ని సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం

  • ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని అందులో తేనె లేదా బెల్లం కలపండి. ఇప్పుడు అందులో ఈస్ట్ కలపండి. 5-10 నిమిషాలు వదిలేయండి. మరో పెద్ద గిన్నెలో గోధుమ పిండి, మైదా, ఉప్పు కలపాలి. అందులో కరిగించిన వెన్న వేసి బాగా కలపాలి. సుమారు 6-8 నిమిషాలు పిండి మెత్తగా కలిపిన తర్వాత కొద్దిగా నూనె రాసి శుభ్రమైన గుడ్డతో కప్పి సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఓవెన్‌ను 190 డిగ్రీలు హీట్‌ చేయాలి, పిండిని రోటీ ఆకారంలో చేసి నూనె పూసి ఒక పాత్రలో ఉంచి ఓవెన్‌లో పెట్టాలి. 30 నిమిషాల తర్వాత బయటికి తీసి కాసేపు చల్లారనివ్వాలి, ఆ తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: వంట కోసం మట్టి కుండలు.. పుష్కలంగా పోషకాలు.. యమ టేస్టీ కూడా!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: చలికాలంలో ఎండలో కూర్చుంటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు