Tooth Paste: మీ టూత్ పేస్ట్ మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది.. ఏలాగో తెలుసుకోండి! టూత్ పేస్ట్‌లో ఉండే సోడియం లౌరిల్ సల్ఫేట్(SLS) అనే పదార్థం అనేక నోటి సమస్యలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.దీని వల్ల డ్రై మౌత్, నోటి అల్సర్లు, క్యాన్సర్ పుండ్లు లాంటివి సంభవిస్తాయి.అందుకే SLS లేని పేస్టులు మంచివి. By Trinath 11 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి SLS: అడ్వర్‌టైజ్‌మెంట్లు చూసి ప్రొడక్ట్స్ కొనే సమాజం మనది. యాడ్ బాగుంటే ఆ వస్తువుకు మంచి గిరాకీ వచ్చినట్టే లెక్క. చాలా మంది ఏది కొన్ని దాని వెనుక రాసి ఉన్న వాటి గురించి ఎక్కువగా చదవరు. కేవలం రేట్ మాత్రమే చూస్తారు. ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మనం టూత్ పేస్ట్(Tooth paste) కొంటాం. దానికి వెనుక ఆ పేస్ట్‌లో ఏం పదార్థాలు ఉన్నాయో రాసి ఉంటాయి. అవి ఎప్పుడైనా చదవి.. అసలు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారా? కచ్చితంగా చేయండి. ఎందుకంటే మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది. మార్నింగ్ లేగగానే అందరూ బ్రష్(Brush) చేస్తారు. దీనికి పేస్ట్ ఉపయోగిస్తారు. పేస్ట్ వెనుక రాసి ఉన్నది మాత్రం చదవరు. మార్కెట్‌లో దొరికే చాలా పేస్ట్‌లలో ఉండే సోడియం లారిల్ సల్ఫేట్ (SLS)తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు నిపుణులు. SLS అనేది టూత్‌పేస్ట్‌లో ఉండే ఒక సాధారణ పదార్ధం. మనం బ్రష్ చేసినప్పుడు వచ్చే నురుగకు ఇదే కారణం. అయితే SLS వల్ల కొంతమంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌ని ఫేస్ చేస్తుంటారు. • అల్సర్: SLS వల్ల కొన్నిసార్లు సున్నితమైన టీత్ కలిగిన కొంతమంది వ్యక్తులలో క్యాన్సర్ పుండ్లు లేదా నోటి పూతలు రావొచ్చు. • డ్రై మౌత్: SLS పొడి నోరుకు దోహదం చేస్తుంది. ఇది కొంతమందికి సౌకర్యంగా ఉండకపోవచ్చు. • రుచి మార్పులు: SLS కొంతమందిలో తాత్కాలికంగా రుచిని ప్రభావితం చేస్తుంది. అంటే టేస్ట్ కోల్పోవడం లేదా డిఫరెంట్ టెస్ట్ అనిపించడం చేస్తుంది. • మీరు వీటిలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే, SLS లేని టూత్‌పేస్ట్ ఎంపికలు అందుబాటులో ఉన్నందున, మీరు SLS లేకుండా టూత్‌పేస్ట్‌కు మారడాన్ని పరిగణించవచ్చు. మీ అవసరాలకు బాగా సరిపోయే నోటి సంరక్షణ ఉత్పత్తులపై వ్యక్తిగతీకరించిన సలహా కోసం ఎల్లప్పుడూ మీ దంతవైద్యుడు లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి. • నోటి ఆరోగ్య ప్రయోజనాల కోసం సోడియం లౌరిల్ సల్ఫేట్(SLS) లేనిదాన్ని ఎంచుకోవడం చాలా మంచిది కాదని కొంతమంది డెంటల్ డాక్టర్లు చెబుతుండగా.. మరికొంతమంది మాత్రం SLSతో అసలు సమస్యలు ఉండవని చెబుతున్నారు. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటున్నారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ SLS కొంతమందిలో నోటి చికాకును కలిగిస్తుందని చెప్పింది. అయితే SLSను FDAతో సహా అనేక సంస్థలు ఆమోదించాయి. ALSO READ: మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా..అయితే మీ పిల్లలకు కూడా ముప్పు పొంచి ఉన్నట్లే! #health-tips #tooth-brush #health-tips-telugu #tooth-paste #sodium-lauryl-sulfate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి