Health : ఈ చిన్న చిట్కాతో అనేక వ్యాధులకు చెక్.. మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది! రోజుకు 25 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తపోటు కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది.వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. By Trinath 30 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Health Tips : నిద్రలేచామా.. రెడీ అయ్యామా.. పరుగు పరుగునా ఆఫీస్‌కు వెళ్లామా.. మళ్లీ తిరిగి ఇంటికి చేరుకొని తిన్నామా.. పడుకున్నామా.. ఇదే రొటీన్‌గా మారిపోయిన లైఫ్(Routine Life) లు చాలా మందివి. ముఖ్యంగా సిటీ(Cities) ల్లో ఉంటున్న వారి జీవితం ఇలానే గడిచిపోతుంది. ఐటి సెక్టర్(IT Sector) లో పని చేసేవాళ్ల లైఫ్ ఇలానే ఉంటుంది. కనీసం రోజుకు 10నిమిషాలు కూడా నడవని పరిస్థితి కొందరిది. అయితే ఇలానే కంటిన్యూ చేస్తే లేనిపోని వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలామందికి 30ఏళ్ల లోపే అనేక ఆరోగ్య సమస్యలు(Health Diseases) వస్తున్నాయి. వ్యాయామం లేకనే ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్న మాట. రోజుకు 25నిమిషాల వ్యాయామంతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు. రోజుకి 25 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి. హార్ట్: క్రమం తప్పకుండా వ్యాయామం(Exercise) చేయడం వల్ల గుండె జబ్బులు(Heart Diseases) వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. మొత్తం గుండెకు సంబంధించిన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు: శారీరక శ్రమ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్న ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యం: వ్యాయామం నిరాశ, ఆందోళన ప్రమాదాన్ని తగ్గిస్తుంది . మానసిక స్థితి, మానసిక శ్రేయస్సును పెంచడంలో సహాయపడుతుంది.వ్యాయామం వల్ల కండరాల బలం కూడా పెరుగుతుంది. షుగర్: రెగ్యులర్‌గా వ్యాయామం చెయడంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షూగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్: వ్యాయామం చేయడం వల్ల రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్‌తో సహా కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థ: వ్యాయామం రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరాన్ని అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది. నిద్ర: రెగ్యులర్ వ్యాయామం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. నిద్ర సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. Also Read: కూలర్ గాలి కారణంగా చిన్న పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందా? ఇందులో నిజమెంత? #heart-health #routine-life #health-tips-telugu #brain-health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి