Women Health: ప్రైవేట్ భాగాల పరిశుభ్రత చాలా ముఖ్యం.. ఆ పార్ట్‌లో ఇన్ఫెక్షన్‌లు రాకుండా ఇలా నివారించుకోవచ్చు!

మహిళలు ప్రైవేట్‌ పార్ట్స్‌ను రోజూ క్లీన్‌గా ఉంచుకోకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌(UTI)లు వచ్చే అవకాశం ఉంటుంది. లైంగిక కలయిక తర్వాత ప్రైవేట్‌ పార్ట్స్‌ను క్లీన్ చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇక యూటీఐలు దరిచేరకుండా ఏం ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Women Health: ప్రైవేట్ భాగాల పరిశుభ్రత చాలా ముఖ్యం.. ఆ పార్ట్‌లో ఇన్ఫెక్షన్‌లు రాకుండా ఇలా నివారించుకోవచ్చు!
New Update

How To Prevent UTI: ఇంటి శుభ్రతతో పాటు శారీరక శుభ్రత కూడా అవసరం. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌లో అమ్మాయిలు క్లీన్లినెస్‌ పాటించాల్సి ఉంటుంది. లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌(UTI)లు వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్‌ రాకుండా ఏం చేయాలో ఇవాళ తెలుసుకుందాం!

రోజూ క్లీన్ చేసుకోవాలి:

వ్యక్తిగత భాగాలను ప్రతిరోజూ క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ జననేంద్రియ ప్రాంతాన్ని రోజుకు ఒకసారి నీరు, తేలికపాటి, సువాసన లేని సబ్బుతో కడగాలి. కెమికల్స్‌ ఎక్కువగా ఉండే సబ్బు వాడితే చికాకును కలిగిస్తుంది. అదే నార్మల్‌ వాటర్‌, మైల్డ్‌ సోప్‌తో క్లీన్ చేసుకుంటే అది ప్రైవేట్‌ పార్ట్‌లోని సూక్ష్మజీవులను తొలగిస్తుంది. యూరిన్‌కు వెళ్లిన తర్వాత క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించవచ్చు. అప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTIs) ప్రమాదం బాగా తగ్గుతుంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

వాటర్‌:

మూత్ర వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీరు తాగడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. అప్పుడే UTI ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే జెర్మ్స్, టాక్సిన్‌లను శరీరం నుంచి యూరిన్‌ ద్వారా బయటకు వెళ్తాయి.

--> లైంగిక కలయిక తర్వాత ప్రైవేట్‌ పార్ట్స్‌ను శుభ్రపరచడం బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది.

--> సరైన సమయంలో యోని సమస్యలను గుర్తించి చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం.

--> మీ ఆహారపు అలవాట్లే మీ మంచి లేదా చెడు ఆరోగ్యానికి కారణం. రోగనిరోధక వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందనే దానిపై మీ ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైన వాటితో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే మీ ఆహారంలో క్రాన్‌బెర్రీస్ చేర్చండి. ఇది UTIల లాంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పే ఆధారాలు ఉన్నాయి.

--> వ్యాయామం లేదా స్విమ్మింగ్ తర్వాత బట్టలు మార్చుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే తడి చెమటతో కూడిన బట్టలు ఎక్కువసేపు ధరించడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంది.

--> సరైన లోదుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. చర్మానికి గాలి ఆడాలి. అందుకే కాటన్ ప్యాంట్ బెస్ట్. ఇది బ్యాక్టీరియా పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. అలాగే యోని ప్రాంతాన్ని పొడిగా ఉంచుతుంది.

Also Read: ఈ ఆకుతో కడుపులో మలినాలు మాయం..ముఖానికి మెరుపు కూడా ఖాయం

WATCH:

#life-style #women-health #uti
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe