Health Tips: పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా?

టమాటా రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎర్రని, పండిన టమాటాల కంటే పచ్చి టమాటా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కంటి చూపు మెరుగవడం, ఎముకలు దృఢంగా ఉండటం, వ్యాధులను అడ్డుకుంటుంది.

Health Tips: పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా?
New Update

Green Tomato Benefits: మనం తినే ఆహారాలలో టమాటా ఒకటి. టమోటాలు లేకుండా ఏ కూర పూర్తి కాదు. టమాటా ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సాధారణంగా ఎర్ర, పండిన టమాటా సాంబారు, పులుసు, చట్నీలకు, ఇతర కూరగాయలకు ఉపయోగిస్తారు. అయితే పచ్చి టమాటాలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? పచ్చి టమాటా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

publive-image

పచ్చి టమాటాల్లో క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. పచ్చి టమాటా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి టమోటాలలో కాల్షియం, పొటాషియం, విటమిన్లు A, C, ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. పచ్చి టమోటాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

publive-image

గ్రీన్ టమాటాలో విటమిన్ కె, కాల్షియం, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ పచ్చి టమాటాలను చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా తినిపిస్తే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి.

publive-image

పచ్చి టమాటాలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దృష్టి మెరుగుపడుతుంది. అలాగే, వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

publive-image

పచ్చి టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు పచ్చి టమోటాలు తినడం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సీజనల్ వ్యాధులను నివారిస్తుంది.

Also Read:

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం

#health-tips #health-news #green-tomato-benefits #health-news-telugu #seasonal-health-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe