Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే.. ఇలా చేయడం తప్పనిసరి

సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే నిత్యం నడక, వ్యాయామం యోగా లాంటివి చేయాలి. సమయానికి పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. సరైన నిద్ర ఉండాలి. ఇవేమి పాటించకుండా ఉండే వివిధ రకాల సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.

Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే.. ఇలా చేయడం తప్పనిసరి
New Update

మంచి ఆరోగ్యానికి ఆహార విహారాలు ఎంత అవసరమో.. ప్రతిరోజూ నడక, వ్యాయామం, యోగా కూడా అంతే అవసరం. ప్రధానంగా ఇవే అనేక రుగ్మతలకు మంచి ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటిస్‌ వరకు.. బీపీ నుంచి హార్ట్‌ ఎటాక్‌ వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్యల వరకు ఏదైన నయం కావాలంటే రోజూ వ్యాయామం, యోగా చేస్తుండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమే.. ఆ ఆహారాన్ని టైమ్‌కు తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
అందుకే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సరైన సమయాలకు భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

బ్రేక్‌ ఫాస్ట్‌ మర్చిపోవద్దు
రోజూ ఉదయాన్నే టిఫిన్ చేస్తే.. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కానీ కొంతమంది వివిధ కారణల వల్ల బ్రేక్‌ ఫాస్ట్ చేయకుండా ఉండిపోతారు. అలాంటి వారు అల్పాహరంగా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, తాజాపండ్లు, కూరగాయల ముక్కలు లాంటివి అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

లంచ్‌కి ఇవి
మధ్యాహ్నపు భోజనంగా సగం తాజా కూరగాయలు, మిగతా సగంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవడం మంచిది. ఇలాగే రక్తంలో చక్కెర నిల్వలను అదుపులో ఉంచుకువేందుకు, లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని కూడా ప్రయత్నించొచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మంచింది. మనం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల నుంచి రోజుకి కొన్ని లక్షల సూక్ష్మరేణులువులు విడుదలవుతుంటాయి. వాటిలో ఉండే రసాయనం మన హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి.

కంటినిండా నిద్ర
కడుపు నిండా తిని..కంటి నిండా నిద్రపోతే ఏ జబ్బూ ఉండదని పెద్దవాళ్లు చెప్పేవారు. రాత్రికి సరైన నిద్ర ఉంటే ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉంటుంది. లేదంటే నిస్సత్తువగా.. ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల కూడా వివిధ జబ్బులు కూడా వస్తాయి. అందుకే వీలైనంత వరకు వయసును బట్టి.. శారీరక శ్రమను అనుసరించి తగినంత నిద్ర పోవడం మంచింది.

Also Read: రోజూ ఎన్ని గంటలు పడుకుంటున్నారు.. ఈ విషయం మీకు తెలుసా?

#telugu-news #health-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe