Health Tips: అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చికిత్స తీసుకోవాల్సిందే.. చాలామంది కొన్ని విషయాల్లో అతిగా ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్నవారు ఇలాంటి వాటికి గురవుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రుమినేషన్ ఫోకస్డ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఆర్‌ఎఫ్-సీబీటీ) అనే చికిత్స ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. By B Aravind 10 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Treatment for overthinking: మనలో చాలామంది కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇలా అన్ని విషయాల్లో ఆందోళనలు, అతి ఆలోచనలు అనేవి రావడం సహజమే. ఏదైన సమస్య పరిష్కారం కోసం ఆలోచించడం మంచిదే. కానీ అతిగా ఆలోచిస్తే మనకే ఇబ్బందులు తలెత్తుతాయి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరైన నిద్రలేకపోవడం.. ఇలా ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం వల్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఇలా అతిగా ఆలోచించేవాళ్లలో పిల్లలు, ముసలివాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువగా యుక్త వయసులో ఉన్నవారే ఇలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే యుక్తవయసులో మెదడు (Brain) పరిపక్వమవుతుంటుంది. వివిధ అలావాట్లు ఏర్పడుతుంటాయి. అందుకే వయసులో ఉన్నవాళ్లే ఇలా అతిగా ఆలోచిస్తుంటారు. మరీ ఇలా అతిగా ఆలోచించే సమస్య నుంచి బయటపడేందుకు ఏదైన సమస్య ఉందా అంటే.. నిపుణలు అవుననే చెబుతున్నారు. ఇలాంటి వారి కోసం.. రుమినేషన్ ఫోకస్డ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఆర్‌ఎఫ్-సీబీటీ) అనే చికిత్స ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ప్రతిసారి కుంగుబాటు, ఆందోళనకు లోనయ్యే పెద్దవారికి ఈ చికిత్స ఎంతో మేలు చేస్తున్నట్లు తేలింది. అయితే యుక్త వయసులో ఉన్నవారికి కూడా చికిత్స పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. Also Read: మందుబాబులకు మత్తెక్కించే వార్త…ఆల్కాహాల్ కూడా మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుందట..!! అయితే ఈ ఆర్‌ఎఫ్-సీబీటీ (RF-CBT) తీసుకున్న వాళ్లలో అతి ఆలోచనలకు కారణమయ్యే మెదడు భాగాల్లోని నాడుల స్థాయిలో అనుసంధానాలు మారుతున్నట్లు గుర్తించారు. దీంతో ఇది యుక్తవసులో వారిపై కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే వీడియో కన్సల్టేషన్ ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని తేలినట్లు పరిశోధకులు చెబుతున్నారు. Also Read: రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు ఈ పని చేస్తే..ఆ రోగాలన్నీ ఫసక్..!! #health-tips #treatment-for-overthinking #overthinking మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి