Health Tips: రాత్రి పూట వీటిని తిన్నారో.. మీ పని అంతే..! జాగ్రత్త

రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. వీటిని తింటే నిద్రకు భంగం కలిగించడంతో పాటు నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. కాఫీ, హై షుగర్, ఫ్రైడ్, ఫ్యాట్, స్పైసీ ఫుడ్స్, పుల్లటి పండ్లు, కార్బోనేటేడ్ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

New Update
Health Tips: రాత్రి పూట వీటిని తిన్నారో.. మీ పని అంతే..! జాగ్రత్త

Health Tips: ఈ మధ్య కాలం ప్రతీ ఒక్కరు తమ జీవితాలను బిజీగా గడిపేస్తున్నారు. ఫ్యామిలీ, వర్క్ టెన్షన్స్ లో పడిపోయి ఆరోగ్యం, ఆహరం పట్ల అంతగా శ్రద్ధ చూపకలేకపోతున్నారు. ఇలా పనిలో పడిపోయి టైంతో సంబంధం లేకుండా  ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తూ ఉంటారు. కొంత మంది అర్దరాత్రి సమయాల్లో కూడా తింటుంటారు. అయితే ఇలా పడుకునే సమయంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల నిద్రలేమి సమస్యతో పాటు ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది.

అధిక ఉప్పు కలిగిన ఆహారాలు

పడుకునే ముందు అధిక సోడియం కలిగిన ఆహారాలు తీసుకోవడం నిద్రకు భంగం కలిగిస్తాయి. అంతే కాదు రక్తపోటును పెంచే ప్రమాదం కూడా ఉంది. అధ్యయనాల ప్రకారం అధిక ఉప్పు కలిగిన ఆహారాలు రాత్రిళ్ళు తరచూ మెలకువ రావడానికి కారణమవుతాయట.

స్పైసీ ఫుడ్స్

రాత్రి సమయంలో ఎక్కువ స్పైస్ తో కూడిన ఆహారాలు అజీర్ణతకు దారి తీస్తాయి. ఇది నిద్ర పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొంత మందికి గుండెల్లో మంట కూడా అనిపిస్తుంది.

publive-image

పుల్లటి ఆహారాలు

సహజంగా రాత్రి పూట పుల్లటి ఆహారాలు తీసుకోవడం ద్వారా శరీరంలో నీరు నిల్వ ఉండడానికి సహాయపడుతుంది. కానీ వీటిలోని పుల్లటి స్వభావం జీర్ణక్రియ ప్రక్రియకు భంగం కలిగించి యాసిడిటీ సమస్యలకు దారి తీస్తుంది. పరోక్షంగా ఇది నిద్రకు భంగం కలిగించడానికి కారణమవుతుంది.

కార్బోనేటేడ్ డ్రింక్స్

పడుకునే ముందు కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇవి నిద్రకు అంతరాయం కలిగించి గుండెల్లో మంట వంటి లక్షణాలను వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.

publive-image

హై ఫ్యాట్ ఫుడ్స్

అధిక కొవ్వులతో కూడిన ఫ్రైడ్ ఫుడ్స్, మాంసాహారం రాత్రి పూట తినకపోవడం మంచిది. వీటిలోని అధిక కొవ్వులు, కేలరీలు జీర్ణమవడానికి ఇబ్బందిని కలిగిస్తాయి. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.

కాఫీ, టీ

అధ్యయనాల ప్రకారం పడుకునే ముందు టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి మంచి కాదని చెబుతున్నాయి. వీటిలోని కెఫిన్ కంటెంట్ నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. హై షుగర్ ఫుడ్స్ కూడా నిద్రలేమికి కారణమవుతాయి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also read: ఢిల్లీ సీఎం ఎవరు? కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు?

Advertisment
తాజా కథనాలు