Health Tips: ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే గుండె ఆరోగ్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది..

రాత్రి త్వరగా నిద్రపోతే తెల్లవారుజామున నిద్ర లేవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదయాన్నే లేవడం వలన అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర లేచిన వెంటనే.. మంచినీళ్లు తాగాలి. ధ్యానం, సూర్య నమస్కారం వంటివి చేయాలి. మనస్సు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి

New Update
Health Tips: ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే గుండె ఆరోగ్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది..

Health Tips: శీతాకాలం వచ్చేసింది. ఈ వాతావరణంలో ఉదయం లేవడం కష్టంగానూ, బోరింగ్‌గానూ ఉంటుంది. ముఖ్యంగా, ఆఫీసు సెలవు ఉన్నప్పుడు.. రాత్రిపూట కాస్త తొందరగా నిద్రపోతే, తెల్లవారుజామున కొంచెం త్వరగా లేచేందుకు ఆస్కారం ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే, ఉదయాన్నే లేవడమే కాకుండా.. లేచిన తరువాత కొన్ని పనులు చేస్తే మరిన్ని ఆరోగ్య ప్రోయజనాలు ఉంటాయి. మరి నిద్ర లేచిన తరువాత ఏం చేయాలో ఓసారి తెలుసుకుందాం..

నీరు తాగాలి..

రోజూ నిద్ర లేవగానే మంచినీళ్లు తాగి రోజు ప్రారంభించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనీసం ఒక గ్లాసు నీరు త్రాగాలి. కావాలంటే నీటిలో తేనె, నిమ్మకాయ, పసుపు కూడా కలిపి తాగొచ్చు. ఇక ఎప్పుడైనా సరే నీళ్లు తాగిన తర్వాతే టీ లేదా కాఫీ తాగాలి. పరిగడుపున టీ అస్సలు తాగొద్దు. అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఒమేగా 3 ఉన్న ఆహారం..

మానసిక ఆరోగ్యంతో శారీరక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. చర్మం మృదువుగా, అందంగా ఉండటానికి, గుండె జబ్బులు దరిచేరకుండా ఉండేందుకు ఆహారంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాన్ని తినాలి. దీని కోసం, మీరు ప్రతి రాత్రి వాల్‌నట్‌లను నానబెట్టి ఉదయం తినవచ్చు. లిన్సీడ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు.

ధ్యానం చేయండి..

ఉదయాన్నే స్కూళ్లకు లేదా ఆఫీసుకు వెళ్లే వారికి ధ్యానం చేయడానికి, వ్యాయామానికి సమయం దొరకదు. అయితే బ్రష్ చేసిన తర్వాత కాస్త గ్యాప్‌లో 10 నిమిషాలు ధ్యానం చేయాలని ఒక నియమం పెట్టుకోండి. ధ్యానం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

సూర్య నమస్కారం చేయండి..

హృదయానికి, మనస్సుకు శాంతిని ఇవ్వడానికి సూర్య నమస్కారం చేయండి. ప్రతిరోజూ 7 నిమిషాల సమయాన్ని వెచ్చించి సూర్య నమస్కారం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్య నమస్కారంతో, చక్రాలు మన శ్వాసను నియంత్రించడానికి పని చేస్తాయి. ఈ నాలుగు చిన్న పనులు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:

మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 9 నుంచే ఉచిత బస్సు ప్రయాణం

Advertisment
తాజా కథనాలు