Foamy Urine Issues: ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం శరీరంలో రకరకాల వ్యాధులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది యూరినరీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రంగు మారడం, మూత్రం వాసన రావడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే.. మూత్రవిసర్జన సమయంలో నురుగు కూడా వస్తుంటుంది. అయితే, ఇలా వచ్చినట్లయితే.. ఏమాత్రం విస్మరించొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్రం నురుగు రూపాన్ని కొన్ని ప్రమాదకరమైన వ్యాధుల ప్రారంభ లక్షణంగా చెబుతున్నారు. మూత్ర విసర్జన సమయంలో నురగలు రావడానికి గల కారణాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
నురుగు మూత్రానికి కారణాలివే..
తక్కువ నీరు త్రాగడం: దాహం వేసినప్పుడు మాత్రమే నీరు త్రాగే అలవాటు మీ కిడ్నీలను దెబ్బతీస్తుంది. కాబట్టి దాహం వేయకపోయినా రోజుకు రెండు మూడు లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోండి. శరీరంలో నీటిశాతం తగ్గితే మూత్రం నురగ, మూత్రం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కిడ్నీ సమస్య: కిడ్నీ సమస్య వల్ల కొందరిలో నురుగుతో కూడిన మూత్రం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటిశాతం తక్కువగా ఉన్నవారిలో కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది. ఫలితంగా మూత్రంలో నురగ వస్తుంది.
ఒత్తిడి: మూత్రం నురుగు రావడానికి ఒత్తిడి కూడా ప్రధాన కారణం. మూత్రం నురుగుతో వస్తే.. ఎక్కువగా ఒత్తిడికి గురికావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమిలోయిడోసిస్: అమిలోయిడోసిస్ చాలా అరుదైన వ్యాధి. దీని వల్ల మూత్రంలో నురుగు కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా కొందరిలో మూత్ర విసర్జన సమస్య కూడా కనిపిస్తుంది.
మధుమేహం: మధుమేహం కూడా మూత్రంలో మార్పులకు కారణమవుతుంది. మధు మేహంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటారు. ఇది కాకుండా మూత్రంలో నురుగు కూడా వస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. లేదంటే వీటి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read:
నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం
పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా?