Health Tips: మీరు రాత్రిపూట నడుస్తారా? మరి ఇలా రాత్రి నడవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా? రాత్రి వేళ నడవటం వల్ల ఆహారాన్ని జీర్ణం చేయడం, శారీరక, మానసిక ఒత్తిడి నుంచి బయటపడుతారు. శరీరం బాగా విశ్రాంతి లభిస్తుంది. అంతేకాదు.. రాత్రి సమయంలో నడవటం వల్ల బరువు తగ్గడం మరింత సులభతరం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే.. ఏ సమయంలో.. ఎలా నడిస్తే మేలు జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం..
రాత్రి నడక బరువు తగ్గడంలో సహాయపడుతుందా?
పండుగల సీజన్‌లో చాలా మంది బరువు పెరుగుతుంటారు. అయితే, ప్రతి రోజూ రాత్రి వాకింగ్ చేసినట్లయితే.. బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫిట్‌నెస్ ట్రైనర్స్, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట నడవటం వల్ల బరువు పెరగకుండా ఉంటారట. రాత్రి భోజనం చేసిన తరువాత కాసేపు ప్రశాంతంగా నడవాలని సూచిస్తున్నారు. ఇలా నడవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
1. కేలరీలను బర్న్ చేస్తుంది: ఏ సమయంలో నడిచినా అది శరీరంపై ప్రభావం చూపుతుంది. వ్యాయామంలా శరీరంపై ప్రభావం కనబరుస్తుంది. అయితే, రాత్రి పూట నడవటం వల్ల కేలరీలు బర్న్ అయి.. బరువు తగ్గడంలో సహాయ పడుతుందని చెబుతున్నారు నిపుణులు.
2. జీవక్రియను పెంచుతుంది: శరీరం శక్తివంతంగా ఉండాలంటే.. భోజనం తర్వాత నడక కంటే మెరుగైన మార్గం మరొకటి లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట నడవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. వేగవంతమైన జీవక్రియ ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
3. ఒత్తిడిని తగ్గిస్తుంది: రాత్రిపూట చల్లని గాలిలో నడవడం అనేది రోజంతా రీఫ్రేమ్ చేయడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పాటునందిస్తుంది. ఒత్తిడి అతిగా తినడం, అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారి తీస్తుంది. అందుకే.. ఒత్తిడిని తగ్గించడం వలన మంచి ఆహారాన్ని ఎంచుకోవడంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో నడవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
4. మంచి నిద్ర: నిద్ర సరిగా లేకపోతే.. శరీర బరువు క్రమంగా పెరుగుతుంది. అందుకే తగినంత విశ్రాంతి ఉండాలి. మంచి నిద్ర కోసం రాత్రి వేళ నడక ఉపకరిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకున్నా.. మంచి నిద్ర కావాలనుకున్నా రాత్రి వేళ కాసేపు నడిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఏ సమయంలో నడవాలి? ఎలా నడవాలి?
రాత్రి వేళ భోజనం చేసిన తరువాత నడిస్తే ప్రయోజనం ఉంటుంది. అయితే, సాధారణంగా మాత్రమే నడవాలి. వేగంగా నడవడటం, పరుగెత్తడం వంటివి చేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రి వేళ వ్యాయామాలు వంటివి చేయొద్దని సూచిస్తున్నారు. తేలికపాటి నడకే ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అదికూడా కేవలం 20 నిమిషాల నడక చాలని చెబుతున్నారు నిపుణులు. వేగవంగా వాకింగ్ చేయాలంటే ఉదయం లేదా సాయంత్రం 5 - 6 గంటల మధ్య ఉండాలి. రాత్రి భోజనం 7, 7.30 లోపు చేయాలి. ఆ తరువాత కాసేపు నడిస్తే మేలు ఉంటుంది.
Also Read: