Rose Petals Health Secrets : ఎరుపు గులాబీ(Red Rose) ప్రేమకు చిహ్నం(Symbol Of Love) గా భావిస్తారు. కేవలం ప్రేమకోసమో.. అలంకారం కోసమో కాకుండా గులాబీ రేకుల(Rose Petals) వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి. శరీర బరువు తగ్గించుకోవడానికి(Body Weight Loss) కేవలం వ్యాయామం లేదా యోగాతో శరీర బరువు తగ్గదు. కొన్నిసార్లు శరీర బరువును తగ్గించడంలో సహాయపడే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విషయంలో గులాబీ రేకులు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ పువ్వు రేకులు జీవక్రియ ప్రక్రియను ప్రేరేపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది శరీర బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతుంది. గులాబీ రేకులతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
గులాబీ రేకులతో ఇలా చేయండి:
- ఒక కప్పు వేడినీటిలో గులాబీ రేకులను వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వండి. నీరు ఊదా రంగులోకి మారిన తర్వాత, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఉంచాలి. ఈ డ్రింక్‌లో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగడం అలవాటు చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
లైంగిక సమస్య:
- శృంగార శక్తిని పెంపొందించడానికి గులాబీ పూల రేకులు సహాయపడతాయని సెక్స్ నిపుణుల అభిప్రాయం. అంతేకాకుండా గుండె సమస్యలు, మెదడు, నాడీ వ్యవస్థ సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
పైల్స్ సమస్య ఉండదు:
- పైల్స్ లేదా హెమోరాయిడ్స్‌తో బాధపడేవారు తమ ఆరోగ్య సమస్య గురించి ఎవరినీ సంప్రదించడానికి ఇష్టపడరు. కానీ ఇది సమస్యను పెంచడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు వైద్యుల సలహాలను సరిగ్గా పాటించడంతో పాటు కొన్ని హోం రెమెడీస్(Home Remedies) కూడా పాటించాలి. రోజూ ఖాళీ కడుపుతో గులాబీ రేకులను మరిగించిన నీటిని తాగడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: బరువు, మధుమేహం తగ్గించే ఇంగువ వాటర్.. ఇలా చేసుకోండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి : షుగర్, క్యాన్సర్‌కి చెక్ పెట్టే మొలకలు.. తింటే అద్భుత ప్రయోజనాలు