Bird Flu: బర్డ్‌ఫ్లూ అదుపులోనే ఉంది..నివారణ దిశగా చర్యలు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

జంతువుల నుంచి మనుషులకు సోకే బర్డ్ ఫ్లూ గురించి కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. బర్డ్‌ఫ్లూ దేశంలో పెరుగుతన్న నేపథ్యంలో దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని..కానీ ఆ వైరస్ నివారణ చర్యలు చేపట్టామని చెబుతోంది.

Bird Flu: బర్డ్‌ఫ్లూ అదుపులోనే ఉంది..నివారణ దిశగా చర్యలు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
New Update

Bird Flu: భారతదేశంలో బర్డ్‌ఫ్లూ మీద నిఘా పెంచుతామని చెబుతోంది కేంద్ర ఆరోగ్యశాఖ. ఈ వైరస్‌కు చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారని...అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేంద్ర మంత్రిత్వశాఖ ఏవియన్ ఇన్ఫ్లూయెంజాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని...ఇప్పటికి పరిస్థితి అదుపులో ఉందని చెప్పింది. H1N1 కేసులతో వ్యవహరించే ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు.

భారతదేశంలో ఎక్కువగా జార్ఖండ్, కేరళ లాంటి రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో, ప్రాంతీయ పౌల్ట్రీ ఫారమ్‌లోని ఇద్దరు వైద్యులు , ఆరుగురు సిబ్బందికి బర్డ్ ఫ్లూ సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం వారందరినీ ఐసోలైషన్‌లో ఉంచామని చెప్పింది. ముందుజాగ్రత్త చర్యగా సుమారు 1,745 కోళ్లు, 450 బాతులు, 1,697 గుడ్లను పౌల్ట్రీ నుంచి తొలగించారు. మరోవైపు కేరళలోని అలప్పుజాలో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి ఆదివారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం జరిగింది.  దాని ప్రకారం బర్డ్‌ ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి కేవలం పాశ్చురైజ్డ్‌ పాలను మాత్రమే తీసుకోవాలని, బాగా ఉడకపెట్టిన మాంసాన్ని మాత్రమే తినాలని సూచించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్.

బర్డ్ ఫ్లూ అంటే?

బర్డ్ ఫ్లూ(Bird Flu) అనేది ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా(Influenza) అని కూడా పిలువబడే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఒక పక్షి నుంచి మరో పక్షికి వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ ప్రాణాంతక రకం హెచ్ 5 ఎన్ 1. హెచ్5ఎన్1 వైరస్ సోకిన పక్షులు చనిపోతాయి. ఈ వైరస్ సోకిన పక్షుల నుంచి ఇతర జంతువులకు కూడా వ్యాపిస్తుంది. 1997లో హాంకాంగ్‌లో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదైంది. ఆ సమయంలో కోళ్ల ఫారాల్లో వ్యాధి సోకిన కోళ్లే ఈ వ్యాప్తికి కారణమని తేలింది. 1997లో బర్డ్ ఫ్లూ సోకిన వారిలో 60 శాతం కోళ్లు చనిపోయాయి. సోకిన పక్షి మలం, ముక్కు స్రావాలు, నోటి లాలాజలం లేదా కళ్ల నుంచి వచ్చే నీరు తాకడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. బర్డ్ ఫ్లూ సహజంగా వలస జల పక్షుల నుంచి ముఖ్యంగా అడవి బాతుల నుంచి వ్యాపిస్తుంది. ఈ అడవి పక్షుల నుంచి ఈ వైరస్ దేశీయ కోళ్లకు వ్యాపిస్తుంది. అడవి పక్షుల నుంచి పందులు, గాడిదలకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. 2011 నాటికి ఈ వ్యాధి బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, భారత్‌, ఇండోనేషియా, వియత్నాం దేశాలకు వ్యాపించింది. బర్డ్ ఫ్లూ సోకిన పక్షిని తాకినప్పుడు మాత్రమే మనుషుల్లో ఇది వ్యాపిస్తుంది. ఇక కొన్ని నివేదికల ప్రకారం ఈ ఫ్లూ చైనాలోని పక్షుల మార్కెట్ నుంచి వ్యాపించిన వ్యాధి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, H5N1 బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న ప్రతి 100 మందిలో 52 మంది 2003 నుండి మరణించారు, మొత్తం 887 కేసులలో 462 మంది మరణించారు. ఇక అమెరికాలోని మానవులకు ఇది సోకడం మొదలైంది. అక్కడ మిషిగాన్‌ స్టేట్‌లో క్షీరదం నుంచి బర్డ్‌ఫ్లూ మనిషికి సోకిన మొదటి కేసు నమోదయిందని చెబుతున్నారు.

సీజల్ ఫ్లూ...

వైరస్‌లను ఎలానో ఆపలేము కానీ సీజనల్ గా వచ్చే ఫ్లూలను అయినా నియంత్రించాలని సూచిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. దీనికి సంబంధించి టీకాలు, జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పింది. సీజనల్ ఫ్లూలను అదుపులో ఉంచుకుంటే వైరస్‌లు అటాక్ అవ్వకుండా కాపాడుకోవచ్చని చెబుతోంది.

Also Read:Karnataka: ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి తొలగించే అవకాశం..

#virus #bird-flu #central-health-ministry
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe