Almonds: బాదం కావాల్సిన కంటే ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే చాలా ప్రమాదం..?

రోజు మన డైట్ లో భాగంగా తీసుకునే బాదం ఆరోగ్యానికి ఎన్నో పోషకాహారాలను అందిస్తుంది. కానీ దీనిని కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే విషపూరితంగా మారీ బరువు పెరగడం, కిడ్నీ సమస్యలు, నట్ అలెర్జిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. కావున ఏదైనా శరీరానికి తగినంత తీసుకుంటేనే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Almonds: బాదం కావాల్సిన కంటే ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే చాలా ప్రమాదం..?
New Update

Almonds: బాదంలోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని మనం రోజు బాదం పప్పులను నానబెట్టి తినడం లేదా ఏదైనా డ్రై ఫ్రూట్ లడ్డులా తీసుకుపోవడం చేస్తుంటాం. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ E,(vitamin E) ప్రోటీన్, ఫైబర్,కాల్షియం ఇలా చాలా పోషకాలు ఉంటాయి. అలా అని శరీరానికి కావలసిన దానికి కంటే మించి తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం. ఏదైనా సరైన మోతాదులో తీసుకుంటేనే అది ఆరోగ్యానికి మంచిది. మనం రోజు తీసుకునే బాదం మోతాదు కంటే మించి తింటే అది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.. జీర్ణక్రియ ఇబ్బందులు, పోషకాహార అసమతుల్యత, దాంతో పాటు ఆరోగ్యం మొత్తం పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

విటమిన్ E ఓవర్ డోస్

బాదంలో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. విటమిన్ E రోగనిరోధక శక్తిని పెంచడం, కంటి ఆరోగ్యం, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిని సరైన మోతాదులో తీసుకుంటే ప్రమాదం లేదు కానీ మోతాదుకు మించి తీసుకుంటే విషపూరితం(Toxic) అయ్యి..కడుపులో ఇబ్బందులు, డయేరియా, ఇంకా జీర్ణక్రియ సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్ E ఎక్కువైనప్పుడుకొన్ని సార్లు రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.

బరువు పెరగడం

బాదంలో(Almonds) కాలరీలు ఎక్కువగా ఉంటాయి కావున రోజు మోతాదుకు మించి తింటే అది బరువు పెరగడానికి కారణమయ్యే అవకాశం ఉంది. కావాల్సిన కేలరీల కంటే అధిక మోతాదులో తీసుకున్నపుడు అవి మన శరీరంలో కొవ్వు రూపంలో స్టోర్ దాని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

Also Read: Skin Care: 10 నిమిషాల్లో మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ పాటించండి చాలు..!

నట్ అలెర్జీస్

కొందరి శరీరం సున్నితంగా ఉంటుంది. అలాంటి వీటిని తీసుకున్నప్పుడు వారిలో అలెర్జీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దద్దుర్లు, ముఖం పై వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి.

కిడ్నీ సమస్యలు

బాదంలో ఆక్సలేట్ అనే ఒక సహజమైన కాంపౌండ్ ఉంటుంది. తినే మోతాదు కంటే ఎక్కువ తిన్నప్పుడు వాటిలోని ఆక్సలేట్స్(Oxalates) కిడ్నీలో ఉండిపోయి అవి కిడ్నీ స్టోన్స్ తయారవ్వడానికి కారణం అవుతాయి. కావున తగిన మోతాదులో తీసుకోవాలి

బాదంను ఏ విధంగా తీసుకోవాలి

రోజూ మీ శరీరానికి సరిపడే బాదంలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి మంచింది. అలాగే వీటిని స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్ లడ్డు, స్మూతీస్ ఇలా వివిధ రకాలుగా వీటిని తీసుకోవచ్చు.

Also Read: Health Tips: ఈ టీ తాగితే మందుబాబులకు కిక్కుదిగాల్సిందే…!!

#almonds-health-benefits #health-effects-of-over-eating-almonds #dry-fruits #almonds
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe