Health Care: మితిమీరిన ఆల్కహాల్ తీసుకుంటున్నారా..అయితే మీ పని గోవిందా!

ఆడ, మగ అనే తేడా లేకుండా చాలామంది సోషల్ డ్రింకింగ్ పేరుతో దీనికి అలవాటు పడుతున్నారు. బీర్లు, మందు తాగుతూ కిక్కును ఎంజాయ్ చేస్తున్నారు.అయితే మితిమీరిన ఆల్కాహాల్ తీసుకోవటం వల్ల శరీరంలో జరిగే అనర్థాలు ఇప్పుడు తెలుసుకోండి!

New Update
Health Care: మితిమీరిన ఆల్కహాల్ తీసుకుంటున్నారా..అయితే మీ పని గోవిందా!

మన సమాజంలో ఆల్కహాల్ తాగడం అనేది ఒక కామన్ అలవాటుగా మారింది.;చిన్నా,పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా చాలామంది డ్రికింగ్ కు అలవాటు పడుతున్నారు.  బీర్లు, మందు తాగుతూ కిక్కును ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ వినియోగం పెరిగితే కాలేయం తీవ్రంగా దెబ్బతింటుదని, ఈ అలవాటు ప్రాణాలకే ముప్పుగా మారవచ్చని వార్నింగ్ ఇస్తున్నారు.కాలేయం మన శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది మెటబాలిజానికి సపోర్ట్ చేస్తూ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ రేటును ప్రోత్సహిస్తూ, శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అలాగే ముఖ్యమైన విటమిన్లను నిల్వ చేసి, మొత్తం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది.

* ఆల్కహాల్‌ ఎఫెక్ట్

అయితే ఆల్కహాల్ డ్రింక్స్ తాగినప్పుడు, కాలేయం దాన్ని ఫిల్టర్ చేసిన ప్రతిసారీ కొన్ని కాలేయ కణాలు చనిపోతాయి. సాధారణంగా లివర్ కొత్త కణాలను అభివృద్ధి చేయగలదు. అయితే ఎక్కువ కాలం అతిగా డ్రింక్ చేస్తే, లివర్ సెల్స్ పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో కాలేయంలో వాపు వచ్చి, దాని పనితీరు తగ్గిపోతుంది. ఫలితంగా లివర్ డ్యామేజ్ అవుతుంది. అందుకే మితిమీరిన ఆల్కహాల్ వినియోగం చాలా డేంజర్ అంటున్నారు షాలిమార్ బాగ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ ఖన్నా. ఆయన జాగరణ్ ఇంగ్లీష్‌తో మాట్లాడుతూ, ఆల్కహాల్ కారణంగా లివర్‌పై పడే ప్రభావాలను వివరించారు.మద్యపానం అలవాటు, కాలేయం ఆల్కహాల్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో లివర్ వాచిపోయి, మచ్చలు ఏర్పడవచ్చు. తర్వాత కాలేయ పనితీరు తగ్గిపోతుంది. అయితే ఆల్కహాల్ మానేయడం లేదా పరిమితం చేయండం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు.

ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎక్కువగా తాగిన వారిలో లివర్ పనితీరు దెబ్బతింటుందని డాక్టర్ సంజయ్ చెప్పారు. ఈ అలవాటు కారణంగా వచ్చే కాలేయ సంబంధిత సమస్యలను అర్థం చేసుకోవడం, పరిష్కరించడం ముఖ్యమని చెప్పారు. ఎక్కువ కాలం డ్రింక్ చేసే వారికి ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ వంటి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ (ALD) రావచ్చని హెచ్చరించారు. సరైన చికిత్స అందించకపోతే ఇవి ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు.

ఆల్కహాల్ కారణంగా ఎదురయ్యే లివర్ ప్రాబ్లమ్స్ యువకుల్లో ఎక్కువగా కనిపిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం, తాగడం సామాజికంగా ఆమోదం పొందిన అలవాటుగా భావించడం, ఒత్తిడి వంటి ఇతర కారణాల వల్ల చాలామంది యువత ఆల్కహాల్‌కు అలవాటు పడుతున్నారు. అయితే ఈ అలవాటుపై నియంత్రణ లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది.

అందుకే ఆల్కహాల్ కారణంగా శరీరంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందో అందరూ అర్థం చేసుకోవాలి. ఈ అలవాటు మానేసి, మంచి లైఫ్‌స్టైల్ అలవాట్లు పాటిస్తే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా డ్రింక్ చేసేవారిలో సమస్యను సూచించే లక్షణాలు బయటపడితే, వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు