/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/health-benefits-of-eating-chick-peas-every-day-for-weight-loss-and-sugar-level-control-jpg.webp)
Chickpeas: ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి కొన్ని సూపర్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సూపర్ ఫుడ్స్‌లో చిక్‌పీస్(శనగలు) కూడా ఒకటి. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని సలాడ్లు, మొలకలుగా చాలా మంది తింటారు. శనగలను వేయించడం వల్ల కలిగే ప్రయోజనం చాలా ఎక్కువ. వేయించిన శనగాల(ChickPeas)ను చాలా మంది ఇష్టపడతారు కూడా. ఇక రోజూ కాల్చిన శనగలు తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
షుగర్ లెవల్స్:
- డయాబెటిస్ ఉన్నవారు వేయించిన శనగలను డైట్‌లో చేర్చుకోవాలి. శనగలు రక్తంలో గ్లూకోజ్‌ను గ్రహిస్తాయి. ఇది శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. మధుమేహాన్ని నియంత్రించాలంటే రోజూ గుప్పెడు శనగలు తినండి.
రక్తం లేకపోవడం
- వేయించిన శనగల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీ శరీరంలో రక్తం లోపిస్తే, రోజూ 1 గుప్పెడు శనగలు తినండి. దీని వినియోగం హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనత వ్యాధిని కూడా తొలగిస్తుంది.
- మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటే శనగలు ఏ ఔషధానికి ఏ మాత్రం తీసిపోవు. కాల్చిన శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఉదర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం నుంచి బయటపడటానికి ప్రతిరోజూ 1 గుప్పెడు శనగలు తినడం ప్రారంభించండి.
- వేయించిన శనగలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిక్‌పీస్ తినడం వల్ల మీకు ఆకలి అనిపించదు. అప్పుడు మీరు అతిగా తినకుండా ఉంటారు. దీనివల్ల మీరు పెద్దగా బరువు పెరగరు. మీ ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే, కచ్చితంగా కాల్చిన శనగలను ఆహారంలో చేర్చండి.
- చలికాలంలో జలుబు, జ్వరం, లాంటి సీజనల్ వ్యాధులు తరచూ వేధిస్తుంటాయి. ఈ వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో 1 గుప్పెడు కాల్చిన శనగలను చేర్చుకోవాలి.
ఇది కూడా చదవండి: చిన్ననాటి గాయాలు పెద్దయ్యాక కూడా వేధిస్తాయా..? పరిశోధనలో షాకింగ్ నిజాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.