Drinking Hot Water: ఉదయాన్నే నిద్ర లేవగానే చాలా మంది వేడి నీళ్లు తాగుతారు. ఇలా నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు కూడా చెబుతుంటారు. ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీని వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో చూడండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే కలిగే లాభాలు..
జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే జీర్ణక్రియ పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు పోషకాల శోషణ కూడా పెంచుతాయి. అంతే కాదు అజీర్ణత, కడుపుబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలను దూరంగా ఉంచుతాయి.
విషపూరితాలను బయటకు పంపును
నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగడం వల్ల కడుపులోని విషపూరితాలను , చెడు పదార్థాలను బయటకు పంపి జీర్ణక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలాసహాయపడతాయి. అలాగే శరీరంలోని వ్యర్దాలను బయటకు పంపి శుభ్రంగా ఉండేలాచేస్తాయి.
బరువు తగ్గడంలో సహాయం
వేడి నీళ్లు బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. సరైన ఆహారంతో పాటు వేడి నీళ్లు తాగడం బరువు తగ్గడానికి సహాయపడతాయి. వేడి నీళ్లు శరీరంలోని కొవ్వును కరిగించి జీవక్రియను మెరుగుపరుస్తాయి.
మలబద్దకం నుంచి ఉపశమనం
ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. వేడి నీళ్లు మోషన్ ఫ్రీగా ఉండేలా సహాయపడతాయి. మరిన్ని లాభాల కోసం వేడి నీళ్లలో కాసింత నిమ్మ రసం వేసి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఆయుర్వేదం ప్రకారం వేడి నీళ్లు చర్మ ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి చర్మ సమస్యలకు కారణమయ్యే విషపూరితలను దూరం చేస్తాయి. రోజు వేడి నీళ్లు తాగడం వల్ల చర్మ స్పష్టత, ఆకృతిని మెరుగుపరుస్తుంది.
మనసు ప్రశాంతంగా ఉండడం
రోజూ వేడి నీళ్లు తాగడం వల్ల శారీరక లాభాలతో పాటు మానసిక లాభాలు కూడా ఉన్నాయి. మన మెదడు.. శరీరం రెండు ఒక దానికి ఒకటి సంబంధం ఉంటాయి. వేడి నీళ్లు తాగితే నాడి వ్యవస్థను శాంత పరుస్తూ.. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి.
Also Read: Depression: డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు .. వీటిని తప్పక పాటించండి..!