Health Tips: ఇది ఒక్క స్పూన్‌ చాలు..వృద్ధాప్యం దరిచేరదు

చాలామంది వృద్ధాప్యం నుంచి బయటపడటం కోసం రకరకాల మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తారు. వృద్ధాప్యం త్వరగా రాకుండా శారీరక ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే ఆయిల్‌ వాడటం వలన వృద్ధాప్య సమస్యలు ఉండవు.

New Update
Health Tips: ఇది ఒక్క స్పూన్‌ చాలు..వృద్ధాప్యం దరిచేరదు

చాలామంది వృద్ధాప్యం నుంచి బయటపడడం కోసం, వృద్ధాప్య ఛాయలను త్వరగా రాకుండా చేయడం కోసం రకరకాల మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు. యాంటీ ఏజింగ్ సీరమ్ లను, యాంటీ ఏజెంట్ క్రీములను, రకరకాల ఆయిల్స్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వృద్ధాప్యం త్వరగా రాకుండా నివారించడానికి మాత్రమే కాకుండా, మన శారీరక ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే ఒక ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం.

అధిక బరువు..అధిక సమస్యలు

ఉరుకులు పరుగుల జీవితంలో వ్యాయాయం చేయడానికి అస్సలు సమయం ఉండటం లేదు. ఫలితంగా అధిక బరువు..అధిక సమస్యలు వస్తున్నాయి. ఇంట్లోనే చిన్న పానీయం చేసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి, తినే ఆహారం వల్ల అధిక బరువు బారిన పడతారు. చిన్న వయసులోనే విపరీతంగా బరువు పెరిగిపోయి, పెద్దవారిలా కనిపిస్తుంటారు. జంక్‌ ఫుడ్‌ అధికంగా తినడం, వ్యాయామం చేయకపోవడంతో పాటు నూనెలో వేయించిన ఆహారం తినడం, ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల బరువు పెరుగుతున్నారు.

ఇది కూడా చదవండి: ఎంతటి థైరాయిడ్‌ అయినా ఇవి తింటే తగ్గాల్సిందే!

ఊబకాయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల అనేక ఇతర సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంటుందంటున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు నిత్యం చేసే పనులతో పాటు ఈ డ్రింక్‌ను చేసుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారు. ఈ పానీయం త‌యారు చేసుకోవ‌డానికి జీలకర్ర, అల్లం, నిమ్మరసం అవసరం అవుతాయి. ముందుగా ఒక గిన్నెలతో స్పూన్ జీల‌క‌ర్ర వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక ఇంచు అల్లం తురుం, ఒక లీట‌రు నీటిని వేసి వేడి చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత తీసి వడకట్టుకోవాలి.

బరువు తగ్గించే డ్రింక్‌

అందులో నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి. అంతే బరువు తగ్గించే డ్రింక్‌ రెడీ అవుతుంది. దీన్ని ఆహారం తీసుకునే అరగంట ముందు 50 మిల్లీ లీటర్ల మోతాదులో తీసుకోవాలి. దీన్ని మూడు పూటలా తీసుకోవడం వల్ల సులభంగా మీరు బరువు తగ్గుతారు. ఈ డ్రింక్‌ వల్ల మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎక్కువగా ఉన్న నీరు బయటికి వచ్చేస్తుంది. అంతేకాకుండా మన బాడీలో మెటబాలిజం రేటు కూడా ఎక్కువ అవుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు జీలకర్రతో ఇలా చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: చలికాలంలో ఉసిరి ఎక్కువగా తినాలా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు