HDFC Bank : క్రెడిట్‌ కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ రికార్డు..దేశంలోనే తొలిసారిగా 2 కోట్ల క్రెడిట్ కార్డులతో..!!

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక క్రెడిట్ కార్డులు జారీ చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏకం 2కోట్లకు పైగా క్రెడిట్ కార్డులను ఇష్యూ చేసింది.

New Update
HDFC Bank : క్రెడిట్‌ కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ రికార్డు..దేశంలోనే తొలిసారిగా 2 కోట్ల క్రెడిట్ కార్డులతో..!!

HDFC Bank crosses 2 crore credit cards: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ  బ్యాంకు(HDFC Bank) రికార్డు క్రియేట్ చేసింది. దేశంలో రెండు కోట్ల క్రెడిట్ కార్డులను జారీ చేసిన తొలి బ్యాంకులు హెచ్ డీఎఫ్ సీ నిలిచింది. 2001లో ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు(Credit card) బిజినెస్ ను ప్రారంభించింది. అదే ఏడాది తొలి క్రెడిట్ కార్డు జారీ చేసింది. 2017లో కోటి క్రెడిట్ కార్డుల మార్కును దాటింది. తర్వాత సరిగ్గా ఆరు సంవత్సరాల ఒకనెలలో ఇది రెట్టింపు అయ్యింది. అంటే 2023లో రెండు కోట్ల క్రెడిట్ కార్డుల మార్కును అధిగమించినట్లు బ్యాంక్ జనవరి 23 యాడ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతానికి క్రెడిట్ కార్డు మార్కెట్లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

అంతేకాదు మనదేశంలో క్రెడిట్ కార్డు వ్యాపారంలో అత్యధిక మార్కెట్ షేరు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుదే. మార్కెట్లో 28.6శాతం వాటా ఉంది. ఆర్బీఐ (RBI) తాజా డేటా ప్రకారం..ఈ బ్యాంకు గతేడాది నవంబర్ లో కొత్తగా 3.2 లక్షల కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసింది. ఈ నవంబర్ లెక్కలతో కలిసి మొత్తం 1.95కోట్ల క్రెడిట్ కార్డులతో నెంబర్ వన్ గా నిలిచింది. నెలవారీ స్పెండింగ్ రేంజ్ సగటున రూ.35వేల కోట్ల నుంచి 45వేల కోట్ల వరకు ఉంది. 2023 డిసెంబర్ వరకు ఈ బ్యాంకు పేమెంట్ బిజినెస్ రిటైల్ అసెట్స్ లో 8శాతం వరకు ఉంది. కన్జూమర్ డ్యూరబుల్ లోన్లు, క్రెడిట్ కార్డులు రెండూ పేమెంట్ బిజినెస్ కోవలోకే వస్తాయి.

ఇది కూడా చదవండి: అమెజాన్ బాటలో మరో దిగ్గజ కంపెనీ..వెయ్యి మంది ఉద్యోగులు తొలగింపు..!!

మొత్తంగా అన్ని బ్యాంకులు కలిసి 9.6కోట్ల క్రెడిట్ కార్డులను జారీ చేసినట్లు ఆర్బీఐ డేటాలో పేర్కొంది. ఎస్ బీఐ (SBI) క్రెడిట్ కార్డు బిజినెస్ 1997లో ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకు 2000వ సంవత్సరంలో షురూ చేసింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు వీటికంటే ఆలస్యంగా 2001లో ప్రారంభించింది. 90ల్లో భారత్ క్రెడిట్ కార్డు బిజినెస్ కు సంబంధించి సిటీ బ్యాంకు (CITI Bank) అధిపత్యం కొనసాగుతుండేది. భారత బ్యాంకులు ఈ బిజినెస్ ప్రారంభించిన తర్వాత ఫారెన్ బ్యాంకుల హవా తగ్గింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు