IT Jobs: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే!

కొన్ని కార్యాలయాలు ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేయమని ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ జాబితాలోకి హెచ్‌ సీఎల్ కంపెనీ కూడా వచ్చి చేరింది. తమ ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటోంది కంపెనీ. వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్‌ ద్వారా సందేశాలు పంపింది.

IT Jobs: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే!
New Update

కరోనా పుణ్యమా అని ఐటీ ఉద్యోగులు(IT employees) అందరూ..ఇంటి నుంచే పని చేయడం మొదలు పెట్టారు. కరోనా ముగిసిన కూడా కొన్ని కంపెనీలు ఇంకా ఇంటి నుంచి పని చేయడానికే అనుమతినిచ్చాయి. అయితే ఇప్పుడు కొన్ని కార్యాలయాలు ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేయమని ఆదేశాలు ఇస్తున్నాయి.

ఈ జాబితాలోకి హెచ్‌ సీఎల్ కంపెనీ కూడా వచ్చి చేరింది. తమ ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటోంది కంపెనీ. వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్‌ ద్వారా సందేశాలు పంపింది.
అయితే వారంలో ఏ మూడు రోజులు ఆఫీసుకు వస్తారు అనేది వారి ఇష్టానికే కంపెనీ వదిలేసింది.

Also read: నేడు అరుదైన సూర్య గ్రహణం..భారత్‌ లో కనిపిస్తుందా?

ఇప్పటికే కొందరు ఉద్యోగులు కార్యాలయాలకు రావడం తప్పనిసరి చేసింది. కొన్ని గ్రేడ్ ల సిబ్బందికి మాత్రం ఈ షరతులు వర్తించవని కంపెనీ సీఈఓ, ఎండీ విజయ్‌ కుమార్ తెలిపారు. పూర్తి స్థాయిలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ అనేది కరెక్ట్‌ ఆలోచన కాదు అని ఆయన అన్నారు.
తాజాగా ఇప్పుడు హెచ్సీఎల్ ఆదేశాలు జారీ చేస్తే..ఇంతకు ముందే ఉద్యోగులను కంపెనీలకు వచ్చి పని చేయాలని టీసీఎస్ ఎప్పుడో తన ఉద్యోగులను కోరింది.

ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకి వచ్చి పని చేయాలని చెప్పి వర్క్‌ ఫ్రం హోం విధానానికి మంగళం పాడాయి. కానీ ఇంకా కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులను కష్టపెట్టాలని చూడటం లేదు. వాటిలో ఇన్ఫోసిస్‌ ఒకటి. ఉద్యోగులు ఎక్కడ నుంచి పని చేస్తామంటే అక్కడ నుంచే పని చేయామనే గొప్ప అవకాశాన్ని వారికి ఇచ్చింది. దీంతో ఉద్యోగులు చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు.

#it-employees #hcl #work-from-home
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe