Hathras: భోలే బాబా సత్సంగ్‌లో తొక్కిసలాట.. 100 దాటిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. హత్రాస్ లోని భోలే బాబా సత్సంగ్‌ భక్తి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మృతి చెందారు. ఇందులో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Hathras: భోలే బాబా సత్సంగ్‌లో తొక్కిసలాట.. 100 దాటిన మృతుల సంఖ్య
New Update

Hathras Stampede: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. హత్రాస్ లోని భోలే బాబా సత్సంగ్‌ (Bhole Baba Satsang) భక్తి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మృతి చెందారు. ఇందులో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు..

ఈ మేరకు యూపీలోని హత్రాస్ జిల్లా సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో భోలే బాబా సత్సంగ్‌ నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో పోలీసులు సైతం కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘోరంలో 100 మందికి పైగా మరణించారు. ఇందులో మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ ఉమేష్ కుమార్ త్రిపాఠి తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఎటా మెడికల్ కాలేజీకి తరలించినట్లు చెప్పారు. ఈ దారుణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి...

ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్‌ ఆశీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇప్పటివరకు 100 మందికి పైగా మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇది ఓ ప్రైవేటు కార్యక్రమం. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలపైనే దృష్టిసారించాం’ అని చెప్పారు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం చెల్లిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

#hathras #bhole-baba-satsang
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe