Paris: పారాలింపిక్స్‌లో ఆర్చరీలో గోల్డ్..చరిత్ర సృష్టించిన హర్విందర్

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో ఈరోజు ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం దక్కింది. భారత్ తరుఫు నుంచి ఆర్చరీలో మొట్టమొదటి సారి బంగారు పతకాన్ని సంపాదించిన ఆర్చర్‌‌గా హర్వీందర్ చరిత్ర సృష్టించారు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 22కు చేరుకుంది.

Paris: పారాలింపిక్స్‌లో ఆర్చరీలో గోల్డ్..చరిత్ర సృష్టించిన హర్విందర్
New Update

Paralympics 2024: పారాలింపిక్స్‌లో ఈరోజు భారత్‌కు ఇప్పటివరకు రెండు పతకాలు వచ్చాయి. ఫురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 ఈవెంట్‌లో సర్జేరావ్ ఖిలారీ రజతం సాధించగా..హర్వీందర్ పురుషుల సింగిల్ ఆర్చరీలో స్వర్ణాన్ని దక్కించుకున్నారు. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఆర్చరీలో బంగారు పతకం రావడం ఇదే మొదటిసారి. దీంతో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో 22  పతకాలు చేరాయి.

టోక్యో గేమ్స్ లో కాంస్య విజేతగా నిలిచిన హర్విందర్ సింగ్ పారిస్‌లో జరిగిన ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన లుకాస్జ్ సిజెక్‌ను ఓడించి పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా నిలిచాడు. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్ సెమీఫైనల్స్‌లో అమెరికాకు చెందిన కెవిన్ మాథర్ చేతిలో ఓడిపోయాడు హర్వీందర్. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరినీ నిరాశపర్చకుండా స్వర్ణాన్ని సాధించాడు. ఎకనామిక్స్‌లో పిహెచ్‌డి చదువుతున్న హర్విందర్.. ఒకే రోజులో ఐదు వరుస మ్యాచ్‌లు గెలిచాడు. చరిత్రలో తన పేరును చెక్కుకున్న హర్విందర్ విలువిద్యలో భారతదేశానికి రెండవ పతకాన్ని సాధించాడు. అతను పసిబిడ్డగా ఉన్నప్పుడు డెంగ్యూ చికిత్స కారణంగా అతని రెండు కాళ్ళు బలహీనంగా అయ్యాయి.

Also Read: USA: అమెరికాలోని జార్జియాలో కాల్పులు..నలుగురు మృతి

#gold #paralympics-2024 #archer #harivinder-singh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe