Harish Rao: చెప్పేది కొండంత, చేసేది గోరంత కూడా లేదు..కాంగ్రెస్ వన్నీ ఒట్టిమాటలే..!! సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. చెప్పేది కొండంత..చేసేది గోరంత కూడా లేదన్నట్టుందన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరుతో ఆర్భాటం చేశారన్నారు. By Bhoomi 31 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. చెప్పేది కొండంత..చేసేది గోరంత కూడా లేదన్నట్టుందన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరుతో ఆర్భాటం చేశారన్నారు. అందరూ ఊహించినట్లుగానే తామే రిక్రూట్ మెంట్ చేసినట్లుగా డబ్బా కొట్టుకున్నారని...ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను వంచిందని మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి..బీఆర్ఎస్ సర్కార్ హాయంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 50రోజుల్లోనే స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చారా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. సొమ్ము ఒక్కడిది..సోకు మరొక్కడిది అన్నట్లు ఉద్యోగనియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈ స్టాఫ్ నర్సుల నియామక పత్రాలు ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. నర్సులుగా ఉద్యోగాలు పొందినవారికి కూడా వాస్తవాలు తెలుసనంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: గతేడాది బడ్జెట్ కానుకలు ఇవే.. మరి ఈ ఏడాది ఏముంటాయో? గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారన్నారు. అయన ప్రసంగంలో దీని గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.... పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు గుప్పించారు. కానీ ఇప్పుడు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పెంపు, రూ. 500 లకు సిలిండర్, 4000 నెలవారీ పింఛన్, మహాలక్ష్మి ద్వారా రూ. 2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి అమలు కానీ హామీల జాబితాలో నేడు జాబ్ క్యాలెండర్ కూడా చేరిందన్నారు. అసలు ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల బాధల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హారీశ్ రావు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ చేసిన వాగ్ధానాన్ని నిలుపుకుంటే తాము స్వాగతిస్తామన్నారు హరీశ్ రావు. #cm-revanth-reddy #harish-rao #nursing-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి