Harish Rao: అసెంబ్లీకైనా ప్రిపేర్ అయి రండి..రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ కౌంటర్..!

17వ కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతను అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

TS: కేసీఆర్ లాగే మీరూ చేయండి.. కాంగ్రెస్ కు హరీష్ రావు కీలక సూచన!
New Update

 

రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి అడుక్కుతినే పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17వ కేఆర్ఎంబి సమావేశంలో ప్రాజెక్టులు అప్పగింతను అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని అరోపించారు. పదవుల కోసం పార్టీలు మారింది రేవంత్ రెడ్డి..ఆయన పక్కన ఉన్న నేతలని విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడుపై నలభై రోజులు అసెంబ్లీని స్తంభింప చేసిన చరిత్ర బిఆర్ఎస్ దన్నారు.

Also Read: ఆదిలాబాద్ జిల్లాకు మాజీ మంత్రి పి. నర్సారెడ్డి పేరు పెట్టాలి: కాంగ్రెస్ సీనియర్ నేతలు..!

విభజన బిల్లు తయారు చేసి ఆమోదించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. విభజన బిల్లు సమయంలో చంద్రబాబు దీక్షలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. రాయలసీమ లిఫ్ట్ ను 2 వ అపెక్స్ కమిటీ మీటింగ్ లో అడ్డుకున్నదే కేసీఆర్ అని స్పష్టం చేశారు. రేవంత్ కు సబ్జెక్ట్ లేక గాయి గత్తర చేస్తున్నాడని.. అసెంబ్లీకి అయినా ప్రిపేర్ అయి రండి అని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయండని.. కేఆర్ఎంబి మీటింగ్ కు అఖిలపక్షాన్ని తీసుకు వెళ్ళండి.. తాము వస్తమని వ్యాఖ్యనించారు.

#harish-rao #telangana #revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe