Harish Rao: అసెంబ్లీకైనా ప్రిపేర్ అయి రండి..రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ కౌంటర్..! 17వ కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతను అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. By Jyoshna Sappogula 05 Feb 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Harish Rao Counter To CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మితిమీరిన అహంకారంతో మాట్లాడారన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి ధోరణిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. నీచమైన పద్ధతిలో కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు చేశారని మండిపడ్డారు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. నెల రోజుల్లో 15 ప్రాజెక్టులు అప్పగిస్తారని కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ లో ఉందని చెప్పారు. ఫిబ్రవరి 1 2024న కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ లో తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించటం లేదని.. ఎక్కడా లేదని అన్నారు. ప్రాజెక్టులు అప్పగిస్తామని రెండు రాష్ట్రాల ఈఎన్సి లు కేఆర్ఎంబి మీటింగ్ లో చెప్పారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి అడుక్కుతినే పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17వ కేఆర్ఎంబి సమావేశంలో ప్రాజెక్టులు అప్పగింతను అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని అరోపించారు. పదవుల కోసం పార్టీలు మారింది రేవంత్ రెడ్డి..ఆయన పక్కన ఉన్న నేతలని విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడుపై నలభై రోజులు అసెంబ్లీని స్తంభింప చేసిన చరిత్ర బిఆర్ఎస్ దన్నారు. Also Read: ఆదిలాబాద్ జిల్లాకు మాజీ మంత్రి పి. నర్సారెడ్డి పేరు పెట్టాలి: కాంగ్రెస్ సీనియర్ నేతలు..! విభజన బిల్లు తయారు చేసి ఆమోదించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. విభజన బిల్లు సమయంలో చంద్రబాబు దీక్షలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. రాయలసీమ లిఫ్ట్ ను 2 వ అపెక్స్ కమిటీ మీటింగ్ లో అడ్డుకున్నదే కేసీఆర్ అని స్పష్టం చేశారు. రేవంత్ కు సబ్జెక్ట్ లేక గాయి గత్తర చేస్తున్నాడని.. అసెంబ్లీకి అయినా ప్రిపేర్ అయి రండి అని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయండని.. కేఆర్ఎంబి మీటింగ్ కు అఖిలపక్షాన్ని తీసుకు వెళ్ళండి.. తాము వస్తమని వ్యాఖ్యనించారు. #telangana #revanth-reddy #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి