Pawan Kalyan: పవన్ ఎన్నికల బరిలో నిలిచినప్పటి నుంచి కూడా ఆయన వెన్నంటే ఉన్న వ్యక్తి కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు , మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య. ఆయన ఎన్నికల సమరానికి ముందు నుంచి కూడా పవన్ కు లేఖలు రాస్తున్నారు.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన లేఖాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు.
తాజాగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరోసారి లేఖ రాశారు మాజీ మంత్రి హరి రామజోగయ్య.. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ ప్రమోట్ చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైన పథకాలకు కూడా చోటు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌లోని కొన్ని పథకాలు ఎంత ఉపయోగపడతాయో షణ్ముఖ వ్యూహంలోని మరికొన్ని పథకాలు అంతకుమించి ఉపయోగంగా చెప్పటానికి ఏ మాత్రం సందేహం లేదని జోగయ్య తెలిపారు.
సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన సూచించిన పథకాలు అమలు చేయాలని హరి రామజోగయ్య లేఖలో సూచించారు. యువకులకు 10 లక్షల రూపాయలు వరకు సబ్సిడీ అందజేసే సౌభాగ్య పథకం బృహత్తరమైనది.. సూపర్ సిక్స్ తో పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని యువత కోరుకుంటున్నారు.. సంపద చేకూర్చే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు.
అందుకే సంపద కూర్చే పథకానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువస్తున్నాను అంటూ ఆ లేఖలో వివరించారు.
Also read: సెమీ ఫైనల్స్‌లోకి లక్ష్యసేన్..మొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్