Hardik Pandya: అది జూన్ 29, 2024.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆఖరి ఓవర్.. సౌతాఫ్రికాను నిలువరించిన పాండ్యా మ్యాచ్ గెలిచిన వెంటనే ఏడ్చేశాడు. అందరూ ఆనందంతో మునిగిపోయిన సమయంలో పాండ్యా గ్రౌండ్‌పై కుర్చొని సైలెంట్‌గా ఉండిపోయి కన్నీరు కార్చాడు. ఆ సమయంలో పాండ్యా కంటి నుంచి జారిన ప్రతీ కన్నీటి చుక్క వెనుక అంతులేని వేదన ఉంది. అటు మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పడంతో ఇక నాడు వైస్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యాకు కెప్టెన్‌గా ప్రమోషన్ వస్తుందని అంతా భావించారు. అయితే నెల రోజులు కూడా గడవకముందే కథ అడ్డం తిరిగింది. వైస్ కెప్టెన్ పదవి కూడా ఊడింది.
ఇలా ఎందుకు చేశారు?
- శ్రీలంకతో వన్డే టీ20 సిరీస్‌ల కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ రెండు ఫార్మెట్లకు వైస్ కెప్టెన్‌గా శుభమన్‌గిల్‌ను ఎంపిక చేయడాన్ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా టీ20 కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎంపిక ఏ మాత్రం బాగాలేదంటున్నారు. ఎందుకంటే రోహిత్ తర్వాత టీమిండియాకు టీ20 పగ్గాలు చేపడుతాడునుకున్న హార్దిక్‌పాండ్యాకు కనీసం వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్ట్ చేశారు. ఇక వైస్‌కెప్టెన్‌గా ఎవరూ ఊహించని శుభమన్‌గిల్‌ను ఎంపిక చేశారు. ఇటివలే ముగిసిన 2024 టీ20 వరల్డ్‌కప్‌ను టీమిండియా ముద్దాడింది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తే హార్దిక్‌పాండ్యా వైస్‌కెప్టెన్సీలో అదరగొట్టాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు.
గంభీరే కారణమా?
- చాలా కాలం తర్వాత టీమిండియా కోచ్ జట్టు సెలక్షన్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్ అవుతున్నాడని అర్థమవుతోంది. ఇటివలే భారత్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఆదిలోనే తప్పటి అడుగుల వేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాండ్యాను ఓ ప్లేయర్‌గానే శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేయడం వెనుక గంభీర్ ఉన్నాడన్నది ఫ్యాన్స్ అభిప్రాయం.
కెప్టెన్‌గా సత్తా చాటిన పాండ్యా:
- నిజానికి రోహిత్ కెప్టెన్‌గా రెస్ట్ తీసుకున్న మ్యాచ్‌లకు పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పటివరకు 16 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు పాండ్యా కెప్టెన్సీ చేశాడు. అందులో 10 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అటు మూడు వన్డేలకూ కెప్టెన్సీ చేసిన పాండ్యా రెండు మ్యాచ్‌ల్లో గెలిచాడు. ఇక ఐపీఎల్‌లో గుజరాత్ టీమ్‌కు ఓ సారి టైటిల్ అందించిన పాండ్యా ఇంకోసారి రన్నరప్ స్థానంలో నిలిచేలా చేశాడు. ఇలా కెప్టెన్సీ పాండ్యా ఇప్పటికే తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయినా కూడా పాండ్యాకు కెప్టెన్సీ ప్రమోషన్ రాకపోగా ఉన్న వైస్ కెప్టెన్సీ పదవీ నుంచి కూడా తప్పించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు:
- అటు వ్యక్తిగతంగానూ కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాండ్యా తన డివోర్స్‌ను అధికారికంగా ప్రకటించాడు. ఇక డివోర్స్ అన్నది వారి వ్యక్తిగత అంశం.. ఇది బహిరంగంగా చర్చించుకునే విషయం కాదు. అయితే పాండ్యాకు ఈ రెండు అంశాలు బాధపెట్టేవే. వైస్ కెప్టెన్సీ పదవి పోయిన రోజే విడాకులను కూడా అనౌన్స్ చేసిన పాండ్యా మరింత స్ట్రాంగ్‌గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిజానికి గతంలో పాండ్యా మాటలు అహంకారంగా ఉండేవి.. తానేదో ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్ అన్నట్టు అతని తీరు కనిపించేది. అయితే ఇప్పుడు పాండ్యా వేరు.. అతని ఆలోచనా తీరే మారిపోయింది. ఓ ఆటగాడు ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు.. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు.. సైలెన్స్‌నే ఆయుధంగా చేసుకోని పనిలో మాత్రం కసిగా చెలరేగుతున్నాడు. అందుకే ఈ గడ్డుకాలన్ని కూడా పాండ్యా దాటగలడని ప్యాన్స్ భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉప్పు ఎక్కువగా తింటే చావే.. రక్తపోటు పెరగడంతో పాటు ఆ సమస్యలు తప్పవు!