BREAKING : రోహిత్‌ ఫ్యాన్స్‌కు అంబానీ అతి భారీ షాక్‌.. కెప్టెన్సీ తొలగింపు..!

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌లో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు 5 ట్రోఫీలు అందించాడు రోహిత్ శర్మ. అయితే వచ్చే సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్సీ అప్పగించింది.

New Update
BREAKING : రోహిత్‌ ఫ్యాన్స్‌కు అంబానీ అతి భారీ షాక్‌.. కెప్టెన్సీ తొలగింపు..!

Hardik Pandya : ఐపీఎల్‌(IPL) లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌లో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు 5 ట్రోఫీలు అందించాడు రోహిత్ శర్మ(Rohit Sharma). అయితే వచ్చే సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. హార్దిక్‌ పాండ్యా ను కెప్టెన్సీ అప్పగించింది.

publive-image పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తూ ముంబై ఇండియన్స్ స్టేట్మెట్ రిలీజ్

నిజానికి హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) ను గుజరాత్‌ నుంచి ముంబై రిటైన్‌ చేసుకున్న వెంటనే రోహిత్‌కి కెప్టెన్సీ నుంచి రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడితే నిజమైంది. ఐపీఎల్‌లో ఐదుసార్లు ముంబైను విజేతగా నిలిపిన ఘనత రోహిత్‌ది. ధోనీ కూడా ఐపీఎల్‌లో ఐదుసార్లు ట్రోఫి గెలిచాడు. అయితే ముంబై వర్సెస్‌ చెన్నై మ్యాచ్‌ల్లో రోహిత్‌ టీమ్‌దే ఆధిపత్యం. ధోనీ తెలివితేటలకే చెక్‌ పెట్టే బ్రెయిన్‌ రోహిత్‌కే ఉందన్నది లెక్కలు చెబుతున్న మాట. అలాంటి రోహిత్‌ శర్మను పక్కన పెట్టి పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు.

మరోవైపు డెబ్యూ కెప్టెన్సీలోనే గుజరాత్‌ను ఐపీఎల్‌ విజేతగా నిలిపాడు పాండ్యా. ఈ సీజన్‌లో గుజరాత్‌ ఫైనల్‌కు వచ్చింది. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నిజానికి పాండ్యా టాలెంట్‌ను ప్రపంచానికి చూపించింది ముంబై ఫ్రాంచైజే. పాండ్యా ముంబై టీమ్‌లోకి వచ్చిన సమయంలో రోహితే కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గత సీజన్‌కు ముందు పాండ్యా ఫ్రాంచైజీని వీడాడు. మళ్లీ వచ్చే సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ పాండ్యాను ట్రేడ్ చేసుకుంది. ఇక పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తున్న విషయాన్ని ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మహేల జయవర్ధనే స్పష్టం చేశారు.
'ఇది లెగసీ బిల్డింగ్‌లో భాగం, భవిష్యత్-సిద్ధంగా ఉండాలనే ముంబై తత్వానికి కట్టుబడి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఎల్లప్పుడూ సచిన్ నుంచి హర్భజన్ వరకు.. రికీ నుంచి రోహిత్ వరకు అసాధారణమైన నాయకత్వంతో ఆశీర్వదించబడింది. వారంతా విజయానికి దోహదం చేస్తూనే భవిష్యత్తు కోసం జట్టును బలోపేతం చేయడంపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగానే హార్దిక్ పాండ్యా IPL 2024 సీజన్‌కు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీని స్వీకరిస్తాడు' అని జయవర్ధనే తెలిపారు. రోహిత్ శర్మ అసాధారణ నాయకత్వానికి ప్రస్తావిస్తూ జయవర్ధనే హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 2013 నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ పదవీకాలం అసాధారణమైనది. రోహిత్‌ నాయకత్వం జట్టుకు అసమాన విజయాన్ని అందించడమే కాకుండా ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా అతని స్థానాన్ని పదిలపరుచుకుందని కొనియాడారు.

Also Read: ‘ఇక చాల్లే… వెళ్లి ఐపీఎల్‌ ఆడుకో.. మరీ ఇంత ఘోరమా బ్రో’ 😡!

WATCH:

Advertisment
తాజా కథనాలు