Pandya: రూ.4.3 కోట్లు మింగేసిన హార్దిక్ పాండ్యా బ్రదర్.. తర్వాత ఏం జరిగిందంటే?

భారత క్రికెటర్లు హార్దిక్‌, కృనాల్‌ పాండ్యా సోదరులకు తమ కజిన్ బ్రదర్ వైభవ్ పాండ్యా భారీ షాక్ ఇచ్చాడు. ఈ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పాలిమర్‌ బిజినెస్ లో వైభవ్ రహస్యంగా రూ.4కోట్లు నొక్కేశాడు. పాండ్యా బ్రదర్స్ కంప్లైంట్ తో వైభవ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Pandya: రూ.4.3 కోట్లు మింగేసిన హార్దిక్ పాండ్యా బ్రదర్.. తర్వాత ఏం జరిగిందంటే?
New Update

Hardik Pandya Brother Vaibhav Pandya: భారత క్రికెటర్లు హార్దిక్‌, కృనాల్‌ పాండ్యలకు తమ సోదరుడు ఊహించని షాక్ ఇచ్చాడు. పార్ట్‌నర్‌షిప్‌ బిజినెస్‌లో దాదాపు రూ.4.3కోట్ల వరకూ వారికి తెలియకుండా దోచేశాడు. విషయం తెలియగానే ఉలిక్కిపడ్డ పాండ్య సోదరులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ముంబై పోలీసులు వైభవ్‌ పాండ్యను (Vaibhav Pandya) అరెస్టు చేశారు.

పాలిమర్‌ బిజినెస్..
ఈ మేరకు హార్డిక్, కృణాల్ సోదరులు తమ కజిన్‌ బ్రదర్ వైభవ్‌ పాండ్యాతో కలిసి 2021లో పాలిమర్‌ బిజినెస్ (రబ్బర్ ఉత్పత్తులు) మొదలుపెట్టారు. అయితే ఈ వ్యాపారంలో హార్దిక్‌, కృనాల్‌ లకు 40శాతం వాటా ఉంది. వైభవ్ కు 20శాతం వాటా ఉంది. అయితే ఈ బిజినెస్‌ లావాదేవీలన్నీ వైభవ్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పాండ్య సోదరులకు తెలియకుండా సొంతంగా మరో పాలిమర్‌ వ్యాపారం మొదలుపెట్టాడు వైభవ్. దీంతో పాత బిజినెస్‌లో రూ.3కోట్ల వరకూ నష్టం వాటిల్లింది.

ఇది కూడా చదవండి: Gill: మేం బరిలో ఉంటే ఎంతటి లక్ష్యమైనా ఖతమే.. శుభ్‌మన్‌!

పరువు తీస్తానని బెదిరింపులు..
అయితే వైభవ్‌ మాత్రం తన లాభాల వాటాను 20శాతం నుంచి 33 శాతానికి పెంచుకోగా.. సంస్థ అకౌంట్‌ నుంచి భారీ మొత్తంలో డబ్బు తన అకౌంట్లో జమ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ప్రశ్నించిన పాండ్య సోదరులపై పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో హార్దిక్‌, కృనాల్‌ పోలీసులను ఆశ్రయించగా వైభవ్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

#mumbai #hardik-and-krunal-pandya #vaibhav
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe