Hardik Pandya : పాండ్యా పేరుతో దద్దరిల్లిన వాంఖడే స్టేడియం.. అప్పుడేమో 'ఛీ' కొట్టి, ఇప్పుడు 'జై' కొట్టి..!

ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా అవ‌మానాలు ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు త‌న‌ను గేలి చేసిన అభిమానులంద‌రి మ‌నుసు గెలుచుకున్నాడు. అందుకు ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో మార్మోగుతున్న హార్దిక్ హార్దిక్ నినాదాలే అందుకు సాక్ష్యం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

New Update
Hardik Pandya : పాండ్యా పేరుతో దద్దరిల్లిన వాంఖడే స్టేడియం.. అప్పుడేమో 'ఛీ' కొట్టి, ఇప్పుడు 'జై' కొట్టి..!

Hardik Pandya Craze In Wankhede Stadium : T20 వరల్డ్ కప్ 2024 లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తన ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. లాస్ట్ ఓవర్ లో బౌలింగ్ వేసి 7 ప‌రుగుల తేడాతో గెలిపించిన పాండ్యా ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యాడు. భావోద్వేగంతో అత‌డు క‌న్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కోట్లాదిమంది భార‌తీయుల‌ను క‌దిలించాయి.

రెండు నెల‌ల క్రితం పాండ్యా వేరు.. ఇప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్‌తో తిరొగొచ్చిన పాండ్యా వేరు. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా అవ‌మానాలు ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు త‌న‌ను గేలి చేసిన అభిమానులంద‌రి మ‌నుసు గెలుచుకున్నాడు. అందుకు ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో మార్మోగుతున్న హార్దిక్ హార్దిక్ నినాదాలే అందుకు సాక్ష్యం. నిన్న రోడ్‌ షో ముగిసిన అనంతరం టీమ్ఇండియా వాంఖడే స్టేడియానికి చేరుకుంది.


దద్దరిల్లిన వాంఖడే...

అప్పటికే స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. దీంతో కెప్టెన్‌ రోహిత్ శర్మ, విరాట్‌ కొహ్లితో పాటు జట్టు సభ్యులందరూ డాన్స్ చేశారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి టీమ్ వెళ్లగానే స్టేడియం మొత్తం నినాదాలతో దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా రోహిత్ శర్మ వేదికపై పాండ్యా గురించి మాట్లాడుతున్న సమయంలో స్టేడియం మొత్తం హార్ధిక్, హార్ధిక్ అనే నినాదాలతో మారుమ్రోగిపోయింది.

దాంతో రోహిత్ తన స్పీచ్ ను కొన్ని నిమిషాల పాటూ ఆపి మరీ స్టేడియం వంక చూసాడు. అదే టైం లో హార్దిక్ స్మైల్ ఇస్తూ పైకి లేచి అందరికీ విక్టరీ సింబల్ చూపుతూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

Advertisment
తాజా కథనాలు