Sachin Kumble: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డు వెనుక కారణం సచినే.. ఎలాగో తెలుసా?

ఇవాళ(అక్టోబర్ 17) 53వ ఒడిలోకి అడుగుపెట్టిన టీమిండియా క్రికెట్ దిగ్గజం అనిల్‌కుంబ్లేకు అభిమానులు విషెస్‌ చెబుతున్నారు. ఇదే సమయంలో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పాక్‌పై 10వికెట్లు తీసిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈమ్యాచ్‌లో అనిల్‌ బౌలింగ్‌కు వెళ్లినప్పుడల్లా, సచిన్ కుంబ్లే నుంచి క్యాప్, స్వెటర్‌ను తీసుకుని అంపైర్‌కి ఇచ్చేవాడు. అలా చేసిన ప్రతీసారి కుంబ్లేకి వికెట్ దక్కింది.

Sachin Kumble: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డు వెనుక కారణం సచినే.. ఎలాగో తెలుసా?
New Update

ఇవాళ(అక్టోబర్‌ 17) భారత్‌ క్రికెట్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే(Anil Kumble) బర్త్ డే.. క్రికెట్‌లో ఎన్నో రికార్డులు తిరగరాసిన స్పిన్నర్‌గా అనిల్‌ కుంబ్లే అభిమానుల మనసులో ఎప్పుడూ నిలిచే ఉంటాడు. దెబ్బ తగిలినా కట్టు కట్టుకొచ్చి ఆడడం కుంబ్లేకే చెల్లింది. పోరాడాలి, నిలపడాలి.. గెలవాలి..ఈ మూడు సూత్రాలను కుంబ్లే ఫాలో అవుతాడు. పట్టువదలని విక్రమార్కుడిలాగా టీమిండియాను గెలిపిస్తాడు. 132 టెస్టుల్లో 619 వికెట్లు పడగొట్టిన కుంబ్లే.. ఇండియా ఓడిపోయే మ్యాచ్‌లను కూడా గెలిపించాడు. కుంబ్లే వివాదరహితుడు కూడా. 18ఏళ్ల పాటు టీమిండియాకు ఆడినా ఏ ఆటగాడితోనూ కుంబ్లేకు గొడవలు లేవు. అందరూ కుంబ్లేతో కలిసిపోతారు. అందుకే కుంబ్లేను జెంటిల్‌మెన్‌ అని కూడా పిలుస్తారు. ముద్దుగా జంబో అని పిలుస్తారు. కుంబ్లేకు భారత్ జట్టులో ఎందరో స్నేహితులు ఉన్నా.. అతనికి సచిన్‌(Sachin)తో పాటు ప్రత్యేక అనుబంధం ఉంది. గ్రౌండ్‌లోనే కాదు.. మైదానం బయట కూడా ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌.

మొత్తం ముగ్గురే:
టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో కుంబ్లే 10 వికెట్లు పడగొట్టిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. క్రికెట్ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోయింది. పాకిస్థాన్‌పై ఈ ఘనత సాధించడం మరింత స్పెషల్‌గా చెప్పవచ్చు. కుంబ్లే తర్వాత ఈ రికార్డును భారత్‌ ఆటగాళ్లు ఎవరూ సాధించలేకపోయారు. 2021లో న్యూజిలాండ్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్ ఈ రికార్డు సాధించాడు. కుంబ్లేకు ముందు 1956లో జిమ్‌లేకర్‌ పేరిక ఈ రికార్డు ఉంది. జిమ్‌ లేకర్ ఇంగ్లండ్ ప్లేయర్‌. ఇటు కుంబ్లే 1999లో పాక్‌పై ఈ రికార్డు సాధించగా.. దీనికి కారణం సచినేనంటాడు కుంబ్లే.

సచిన్ ఏం చేశాడంటే:
క్రికెట్‌ చూసేవాళ్లకి ఎలాగైతే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయో.. క్రికెట్ ఆడేవారికి కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అవి ప్రతీమ్యాచ్‌లోనూ ఉండకపోయినా టైమ్‌కి తగ్గట్టుగా మారుతుంటాయి. 1999లో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మ్యాచ్‌లో ఓ నమ్మకాన్ని ఫాలో అయ్యాడు. . ఈ గేమ్‌లో కుంబ్లే బౌలింగ్‌కు వెళ్లినప్పుడల్లా, సచిన్ కుంబ్లే నుంచి క్యాప్ , స్వెటర్‌ను తీసుకునేవాడు. తర్వాత సచినే కుంబ్లే వస్తువులను అంపైర్‌కు ఇచ్చేవాడు. సాధారణంగా బౌలర్ స్వయంగా తన వస్తువులను అంపైర్‌కు ఇస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో కుంబ్లే బౌలింగ్‌కి వచ్చినప్పుడు సచిన్‌ ఆ పని చేశాడు. సచిన్‌ అలా చేసినప్పుడు కుంబ్లే వికెట్ పడగొట్టాడు. అలా కుంబ్లే పది వికెట్లు తీసే వరకు ఈ ఇద్దరూ ఇదే నమ్మకాన్ని ఫాలో అయ్యారు. కుంబ్లే అనేక సందర్భాల్లో ఇది చెప్పుకున్నాడు.

ALSO READ: ఆ విషయంలో ఇండియానే బిగ్‌ బాస్‌.. ఈ సారి వరల్డ్‌కప్‌ మనదే భయ్యా! రీజన్‌ ఇదిగో

#sachin-tendulkar #anil-kumble #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe