Rahul Dravid Birthday : హ్యాపీ బర్త్‌డే.. ది వాల్, మిస్టర్ డిపెండబుల్.. ఇండియన్ క్రికెట్‌లో మిస్టర్ డిపెండబుల్ ఒక్కడే. అతను క్రీజ్‌లో ఉన్నాడంటే గట్టి పదునైన గోడ కట్టినట్టే. దాన్ని పగులగొట్టాలంటే బౌలర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ది వాల్ అని ముద్దుగా పిలుచుకునే ఇండియన్ క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ బర్త్ డే ఈరోజు. By Manogna alamuru 11 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Rahul Dravid Birthday : కొందరు ఆట ఆడతారు... మరి కొందరు తమ ప్రవర్తన ద్వారా పేరు తెచ్చుకుంటారు. ఇంకా కొందరు వీటన్నింటినీ దాటి ఎనలేని గౌరవాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ఇండియన్ క్రికెట్‌లో కచ్చితంగా చెప్పుకునే పేరు రాహుల్ ద్రావిడ్(Rahul Dravid). క్రికెట్(Cricket) లో నిలకడ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం... టెక్నిక్ విషయంలో దిగ్గజాలనే మైమరిపించిన మొనగాడు.. ఎంతోమందికి రోల్ మోడల్... రాహుల్ ద్రావిడ్. జట్టు కోసం కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. కీపర్ లేడు అంటే నేనున్నా అన్నాడు. ఓపెనర్ లేడు, లేక వన్‌డౌన్‌లో సేవలు కావాలన్నా.. మిడిలార్డర్‌లో వికెట్లకు గోడ కట్టాలన్నా దిక్కు అతనే అయ్యాడు. వివాదాలకు ఆమడ దూరం... మర్యాదకు మారు పేరు ది వాల్. కెరియర్‌లో ఉన్నన్నాళ్ళు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని క్రికెట్ చరిత్రలో లెజెండ్‌గా నిలిచిపోయాడు. ది వాల్.. మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని ఇండోర్(Indore) లో 1973 జనవరి 11న పుట్టిన రాహుల్ ద్రావిడ్ పెరగడం మాత్రం అంతా బెంగళూరు(Bengaluru) లోనే. అక్కడే క్రికెట్ పాఠాలను నేర్చుకున్నాడు. అండర్-19(Under - 19) లో కర్ణాటక జట్టు తరఫున ఆడాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1996 ఏప్రిల్ 3న శ్రీలంక పై వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. అదే ఏడాది లార్డ్స్ మైదానంలో ఇంగ్లాడ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి టెస్ట్ మ్యాచ్. చాలా మ్యాచ్‌లో ద్రావిడ్ ఒంటరి పోరాటం చేసి టీమిండియా(Team India) ను విజయ తీరాలకు చేర్చిన సందర్బాలు ఉన్నాయి. వన్డేలో ద్రావిడ్ ఆటతీరుపై కొన్ని విమర్శలు వచ్చిన తన బ్యాట్‌తోనే వాటికి సమధానం చెప్పాడు. టెస్టులో మాత్రం ద్రావిడ్ తనదైన ఆటతో ది వాల్ అని, మిస్టర్ డిపెండబుల్ అని పేరు తెచ్చుకున్నాడు. ద్రావిడ్ పరుగులు... తన కేరీర్‌లో 164 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్ 13,288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో 344 మ్యాచ్‌లు ఆడి 10,889 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, ఒకే ఒక అంతర్జాతీయ టీ20 ఆడిన ద్రావిడ్ ఆ మ్యాచ్‌లో 31 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 24,208 పరుగులు చేశాడు. 2012 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ద్రావిడ్ తర్వాత కోచ్ గా అవతారమెత్తాడు. క్రికెటర్‌గా ఇతను ఎంత సక్సెస్ అయ్యాడో...కోచ్‌గా కూడా అంతే రాణించాడు. అండర్-19, భారత్-ఎ జట్లకు ఆయన చీఫ్ కోచ్‌గా వ్యవహరించాడు. రాహుల్ కోచింగ్‌లో అండర్ 19 భారత జట్టు వరల్డ్‌కప్(World Cup) ను సాధించింది. ఇక 2021 నుంచి ద్రావిడ్ భారత జట్టుకుకూడా కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా ఫైనల్స్ వరకు రావడం వెనుక ద్రావిడ్ కృషి ఎంతో ఉంది. ప్రపంచకప్ తర్వాత కోచ్ పదవి నుంచి రాహుల్ తప్పుకున్నారు. అయితే ఈ ఏడాదిలో టీ20 వరల్డ్‌కప్ ఉండడంతో బీసీసీఐ అతన్నే మళ్ళీ కోచ్‌గా నియమించింది. రాహుల్ ద్రావిడ్ రికార్డులు... టెస్టుల్లో 3వ స్థానంలో 10,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ : ద్రవిడ్ నం. 3 స్ఆనంలోనే ఎక్కువ కాలం బ్యాటింగ్ చేశాడు. దీంతో ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 10,000 పరుగులకు పైగా స్కోర్ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులు నెలకొల్పాడు. రాహుల్ 219 ఇన్నింగ్స్‌లలో 52.88 సగటుతో 10, 524 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో అతని కెరీర్‌లో 28 సెంచరీలు, 50 అర్ధసెంచరీలు ఉన్నాయి. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా నాలుగు సెంచరీలు: నాలుగు వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ కొట్టిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లలో ద్రవిడ్ ఒకడిగా నిలిచాడు. 2002లో ఇంగ్లండ్‌పై ఈ ఘనతను సాధించాడు. ఇందులో ద్రవిడ్ స్కోర్లు 115 (నాటింగ్‌హామ్), 148 (లీడ్స్), 217 (ది ఓవల్), ముంబైలో వెస్టిండీస్‌పై అజేయంగా 100 పరుగులు సాధించాడు. సారథిగా ఆరు దేశాల్లో టెస్టు మ్యాచ్‌ల విజయం: ద్రవిడ్ కెప్టెన్సీలో భారత్ స్వదేశంలో విజయాలతో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లలో టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది. అలాగే దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి టెస్ట్ విజయానికి నాయకత్వం వహించాడు. 2004 ముల్తాన్ టెస్ట్ సమయంలో ప్రసిద్ధ ఇన్నింగ్స్ విజయంలో కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కనీసం ఒక టెస్టులో గెలిచిన మరే ఇతర కెప్టెన్ మూడు కంటే ఎక్కువ దేశాలకు కెప్టెన్‌గా ఉండలేదు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు: టెస్టుల్లో 210 క్యాచ్‌లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఏ ఫీల్డర్ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేదు. మొత్తం 164 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. #cricket #rahul-dravid #birthday #the-wall #mister-dipendable మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి