HanuMan 2: హనుమాన్ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్!

చిన్న సినిమాగా వచ్చి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది హనుమాన్ మూవీ. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్ మూవీకి సీక్వెల్ వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఈ సీక్వెల్ లో హనుమాన్ విజువల్స్ మరింత ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తోంది.

HanuMan 2: హనుమాన్ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్!
New Update

HanuMan 2_ The Hanuman:ఈ సంక్రాంతికి స్టార్ హీరోల రేసులో వచ్చిన చిన్న సినిమా(HanuMan) హనుమాన్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. పెయిడ్ ప్రీమియర్స్ లో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిన హనుమాన్ మూవీ రిలీజ్ అయిన తరువాత రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. ఇక..యుఎస్ మార్కెట్లో తిరుగులేని రికార్డులను సాధిస్తున్న ఈ మూవీ ఏకంగా 3 మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేసి ఫినానిమల్ రికార్డు క్రియేట్ చేసింది టాలీవుడ్ నుంచి 3 మిలియన్ మార్క్ టచ్ చేసిన సినిమాలు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి.వీటిలో హనుమాన్ మూవీ నిలుస్తూ..ఆల్ టైం టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచి రికార్డు నెలకొల్పింది.నార్త్ లో సైతం తన హవా కొనసాగిస్తోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించేే మాట్లాడుకుంటున్నారు. అతి తక్కువ టైంలో తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ఔట్ పుట్ తీసుకురావడంతో ఈయన నాలెడ్జ్ కు అందరూ ఫిదా అవుతున్నారు.

హనుమాన్ మూవీ 12 భాగాలు

ఇక ..ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి హనుమాన్ మూవీ 12 భాగాలుగా వస్తుందని దర్శకుడు చెప్పడం కూడా జరిగింది. ప్రతీ మూవీలోనూ ఓ సూపర్ హీరో ఉంటాడని, ఇందులో కొన్ని హీరోయిన్ సెంట్రిక్ గా కూడా ఉంటాయని చెప్పుకొచ్చాడు. అయితే .ఇప్పుడు అందరి దృష్టి హనుమాన్ సీక్వెల్ ది హనుమాన్ మీదే ఉంది ఈ యూనివర్స్ ఎలా ఉండబోతోంది అనేది అత్యంత క్యూరియాసిటి నెలకొంది.

రియలిస్టిక్ వెర్షన్ లో హనుమాన్ 2

సెకెండ్ పార్ట్ పై ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, బయట ఫిల్మ్ లవర్స్ లోనూ హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటికే హనుమాన్ వసూళ్లతో విస్తుపోతున్న ట్రేడ్ వర్గాలు ఈ సీక్వెల్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.ఈ సీక్వెల్ లో హనుమాన్ తేజ సజ్జ తో పాటు భజరంగ్ హనుమంతుని పై కూడా పూర్తి స్థాయిలో సన్నివేశాలు ఉంటాయని, పార్ట్ వన్ లో హనుమంతుడిని ప్రెజెంట్ చేసిన విధంగా కాకుండా ఈ సీక్వెల్ లో హనుమంతున్ని రియలిస్టిక్ వెర్షన్ లో (PrasanthVarma)ప్రశాంత్ వర్మ ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం.ఈ హనుమాన్ 2 లో (Adivi Sesh) అడివి శేష్ సైతం ఓ మాంచి రోల్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా సీక్వెల్ షూటింగ్ కు ముందే సెన్సేషన్ అవ్వడం బాహుబలి తరువాత హనుమాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చుఇంకా..ఇవే కాకుండా మరిన్ని ఇంటరెస్టింగ్ అప్డేట్స్ హనుమాన్ టీమ్ నుంచి అతిత్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పట్లో అయితే హనుమాన్ హవా తగ్గేలా లేదు.

Also Read:పూనకాలు పుట్టించే మెగా 156 టైటిల్! మెగా ఫ్యాన్స్ కు పండగే పండగ

#hanuman2 #primeshow-entertainment #teja-sajja #prasanth-varma
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe