Hanuman : హనుమాన్ ఓటీటీ రిలీజ్ అప్పుడే... లాభాల్లో దూకుడు

ఎలాంటి అంచనాలు లేకుండా ఈ నెల 12న విడుదలయిన సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా విడుదలయిన తొలిరోజే ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకున్నది. పెద్ద సినిమాలతో సమానంగా లాభాలు అందుకుంది.

New Update
Hanuman : హనుమాన్ ఓటీటీ రిలీజ్ అప్పుడే... లాభాల్లో దూకుడు

ఎలాంటి అంచనాలు లేకుండా ఈ నెల 12న విడుదలయిన సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా విడుదలయిన తొలిరోజే ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకున్నది. జాంబిరెడ్డితో చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తక్కువ సమయంలోనే ప్రేక్షకులు మన్ననలు పొంది వందకోట్లకు పైగా బిజినెస్ చేసింది. అటు తేజా సజ్ఞా నటనకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి.

హనుమాన్ కు థియేటర్లు కూడా కేటాయించకపోవడంతో నిర్మాణ యూనిట్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది.  నిర్మాతల మండలి జోక్యంతో థియేటర్లలోకి అడుగుపెట్టిన తొలిరోజే పాజిటివ్ రెస్పాన్స్ ను సంపాదించింది. ఆ సమయంలోనే ఓటీటీలోకి వస్తుందన్న ప్రచారం సాగింది. అయితే నిర్మాతలు మాత్రం చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఆసక్తి చూపారు. వారు అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమా కొంత రికార్డులను సొంతం చేసుకుంది. అమెరికాలో సైతం గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.

ఇది కూడా చదవండి :Nizamabad: లిఫ్టులో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించిన సెక్యూరిటీ గార్డు..!

తాజాగా తిరిగి హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌పై  ఆసక్తికర చర్చ జరుగుతోంది.  ఈసినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. సుమారు రూ.30 కోట్లకు జీ5 సినిమా హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ రైట్స్ మొత్తాన్ని జీ5 కే విక్రయించినట్లు తెలిసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో హనుమాన్ ఈజీగా మరో రూ.100 వరకు రాబట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఓటీటీ హక్కులను జీ5కు విక్రయించినప్పటికీ థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. దీంతో ఫిబ్రవరి మూడోవారంలో స్ట్రీమింగ్ కావలసిన ఈ సినిమాను వాయిదా వేసి మరో రెండు నెలల తర్వాతే అంటే మార్చి చివరివారంలో స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. ఇది కనుక నిజమే అయితే నిర్మాతలకు రెండు రకాలుగా లాభాల పంట పండినట్టేనని ఫిలింనగర్ లో చర్చ సాగుతుంది.

Advertisment
తాజా కథనాలు