Hanu-man Team : కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన హనుమాన్ మూవీ టీం.!

కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి షురూ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హనుమాన్ టీం హోంమంత్రిని కలిసింది.

Hanu-man Team : కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన హనుమాన్ మూవీ టీం.!
New Update

Hanu-man Team Meets Home Minister :  కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికల(Lok Sabha Elections) సందడి షురూ కానుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) కూడా ఉండటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ(BJP) సీనియర్ నేత అమిత్ షా(Amit Shah) తెలంగాణ(Telangana) లో పర్యటిస్తున్నారు. అమిత్ షాతో హనుమాన్ మూవీ టీం భేటీ అయ్యింది.ఈ భేటీకి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమిత్ షాను కలవడం సంతోషంగా ఉందంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.

Hanu-man Team Meets Home Minister

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) డైరెక్షన్ లో యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) ప్రధాన పాత్రలో వచ్చి సినిమా హనుమాన్(Hanu-Man). సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంది. కేవలం 75కోట్లతో నిర్మించిన ఈ మూవీ దాదాపు 300కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిందంటే ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ గా అమ్రుతా అయ్యర్(Amritha Aiyar) నటించింది. మరో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్ట్ చేసింది.

Hanu-Man Team - Amit Shah

ఇది కూడా చదవండి : రష్యాలో కూలిన కార్గో విమానం..వైరల్ వీడియో..!

#central-home-minister #amit-shah #hanu-man
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe