Hanuman Collection: 10 రోజుల్లో 200 కోట్లు కొల్లగొట్టిన హనుమాన్..!

తేజ సజ్జ లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ నెల 12న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200Cr వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2024లో 200Cr కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు.

Hanuman Collection: 10 రోజుల్లో 200 కోట్లు కొల్లగొట్టిన హనుమాన్..!
New Update

Hanuman Movie Collection:  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన లేటెస్ట్ చిత్రం హనుమాన్. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల జతగా రేసులో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వరలక్ష్మి శరత్ కుమార్, అమ్రిత, వెన్నెల కిషోర్, సముద్రఖని, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీమియర్స్ లో రికార్డు రేంజ్ లో వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత మరింత వేగంగా దూసుకెళ్తుంది. తాజాగా మూవీ మేకర్స్ హనుమాన్ కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read: Mega Heroes: ఆ మూడు నెలలు మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా మెగా సినిమాల సందడి

publive-image

హనుమాన్ కలెక్షన్స్

50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్నీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. హనుమాన్ చిత్రం 2024 లో 200 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా దుమ్మురేపుతోంది. హనుమాన్ వసూళ్ల జోరు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే.. నేడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా..యూఎస్ లో పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన థియేటర్స్ లో హాఫ్ రేట్ కె టికెట్స్ అందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అంతే కాదు మిరాజ్ సినిమాస్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఒక్కరోజు బయ్ వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది. బుక్ మై షోలో MIRAJBOGO కోడ్ ఉపయోగించి ఈ ఆఫర్ పొందవచ్చు.

Also Read: Namrata Birth Day: నమ్రతకు.. మహేష్ బాబు బ్యూటీఫుల్ విషెస్.. వైరలవుతున్న ట్వీట్

#hanuman-movie #teja-sajja #hanuman-collections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe