సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం సంచలనాలకు వేదికైంది. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం భారీ సినిమాల రికార్డులను కూడా బద్దలు కొడుతోంది. వసూళ్లలోనూ జోరుమీదున్నది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ సహా పలు విదేశీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు.
జాంబీ రెడ్డి చిత్రంతో వైవిద్య దర్శకుడిగా పేరుతెచ్చుకున్నప్రశాంత్ వర్మ సంక్రాంతి టార్గెట్ గా తేజ సజ్జా హీరోగా హనుమాన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. మొదట పెద్దగా ప్రభావం చూపదని భావించినప్పటికీ తెలుగుతో పాటు హిందీ వర్షన్ కూడా అదరగొడుతోంది.
ఇది కూడా చదవండి :Hyderabad: మానవత్వం, నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, అలా వైకుంఠపురం చిత్రాల రికార్డులను బద్దలు కొడుతూ అమెరికాలోనూ తన సత్తా చాటుతుంది. అమెరికాలో ఏకంగా 3 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకొని ఒక అరుదైన రికార్డు సృష్టించింది. ఈ మార్క్ ను దాటిన తెలుగు సినిమాలు చాలా తక్కువ. అలాంటిది విడుదలైన నాలుగు రోజుల్లోనే అంతటి రికార్డును హనుమాన్ సొంతం చేసుకుంది. మరోవైపు ఉత్తర అమెరికాలో ఆదివారం ఒక్కరోజే అత్యథిక కలెక్షన్లు సాధించి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. హనుమాన్ కంటే మందు బాహుబలి-2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు ఆదివారం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలుగా తొలిరెండుస్థానాల్లో ఉంటే మూడవ స్థానంలో హనుమాన్ నిలవడం విశేషం.
ఇది కూడా చదవండి :Mahalakshmi Scheme: గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2500!
ఇక హనుమాన్ చిత్రం నాలగురోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ ను దాటింది. ఇదే విషయాన్ని ప్రశాంత్ వర్మ ట్వీట్టర్ వేదికగా ప్రకటించటంతో ఇది నా తొలి వంద కోట్ల సినిమా అని చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక ఉత్తరాదిలోనూ హనుమాన్ భారీ వసూళ్లు రాబడుతుంది. ఉత్తరాదిలో హిందీ వర్షన్ తో పాటు హిందీ వర్షన్ కూడా వసూళ్లలో దూసుకుపోతుంది. ఈ నెల చివరివరకు కూడా మరే భారీ చిత్రం విడుదలకు లేకపోవడం వల్ల వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ క్రిటిక్ లు అంచనా వేస్తున్నారు.